అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న త్రిపుల్ ఆర్ నుంచి వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. అందరి పుట్టినరోజులకు ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేసుకుంటూ వచ్చారు రాజమౌళి. ఇప్పుడిక అజయ్ దేవగణ్ వంతు వచ్చింది. ఏప్రిల్ 2 అజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ‘RRR’ టీమ్ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని మరో పోస్టర్ ద్వారా ప్రకటించారు రాజమౌళి. ఈ లిస్ట్ లో ఇక మిగిలింది శ్రీయ మాత్రమే. మరి ఆమె లుక్ కూడా డేట్ చూసుకొని రిలీజ్ చేస్తారో…లేదంటే డైరెక్ట్ థియేటర్ లోనే చూసుకోమంటారో చూడాలి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్( రౌధ్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న నుంచి వస్తున్న చిత్రం కావడం, స్వాతంత్ర్య సమరవీరులుగా స్టార్‌ హీరోలు కనిపించనుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి. దసరా సీజన్లో అక్టోబర్‌ 13న థియేటర్లకు రాబోతున్న ఈ మూవీ.. ఇప్పటికే ఫ్రీ రిలీజ్‌ బిజినెస్‌లోనే భారీ మొత్తాన్ని రాబడుతున్నట్టు సమాచారం. ఇలాంటి వార్తలను ధృవీకరిస్తూ ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి ఓ సంచలన ప్రకటన బయటికొచ్చింది.
ఆర్‌ఆర్‌ఆర్‌ తమిళ్ థియేట్రికల్‌ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్‌ సొంతం చేసుకొంది. ఈ సంగతిని లైకా ప్రొడెక్షన్స్‌ ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా విడుదలచేసింది. ‘బిగ్గెస్ట్‌ ప్యాన్‌ ఇండియా సినిమా త్రిపుల్ ఆర్ తమిళనాడు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నామని అనౌన్స్ చేయడం ఎంతో గర్వంగా ఉంది’ అంటూ లైకా ప్రొడక్షన్స్‌ ట్వీట్‌ చేసింది. అయితే భారీగా డబ్బులు చెల్లించి లైకా సంస్థ ఈ రైట్స్ ను దక్కించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. దాదాపు 45 కోట్ల రూపాయల అతిపెద్ద మొత్తానికి తమిళ్ థియేట్రికల్స్‌ హక్కులను కొన్నదని సమాచారం. అయితే ఇప్పుడింత డబ్బు చెల్లించడం అంత ఆశ్యర్యపోయే విషయమేం కాదు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘బాహుబలి 2’ తమిళనాట 78 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అంతుద్ది కాబట్టే లైకా ప్రొడక్షన్స్‌ 45 కోట్ల రూపాయలు చెల్లించేందుకు తేలికగా ఒప్పుకుంది. భారీ అంచనాలున్న ఆర్‌ఆర్‌ఆర్ 45 కోట్ల రూపాయలను మించి వసూలు చేయడం పెద్ద కష్టమేమి కాదని నమ్ముతున్నాయి చిత్రవర్గాలు.

శివరాత్రికి ముహూర్తం
మాస్ రాజా రవితేజ నటిస్తోన్న ఖిలాడి టీజర్ ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజ్ చేస్తున్నారు. అర్జున్, అనసూయ కీరోల్స్ ప్లే చేస్తోన్న ఖిలాడి మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హీరోయిన్ పక్కా..?
గోపీచంద్ – మారుతి పక్కా కమర్షియల్ మూవీలో హీరోయిన్ గా రాశిఖన్నా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఇందులో మరో హీరోయిన్ గా తెలుగమ్మాయి ఈశారెబ్బా కనిపించనుందట.

రామ్..ఊర మాస్
పందెంకోడి, ఆవారా సినిమాల డైరెక్టర్ లింగుస్వామితో…హీరో రామ్ తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. లింగు స్వామి చెప్పిన ఊర మాస్ స్టోరి రామ్ కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని టాక్.

పవర్ ప్లే…కమింగ్
కొండా విజయ్ కుమార్, రాజ్ తరుణ్ కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ ప్లే మూవీ మార్చి 5న రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈ మూవీ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

సైజ్ జీరో అనుష్కలా…
అజయ్ దేవగణ్ సరసన ప్రణీత నటిస్తోన్న కొత్త సినిమాలో ఆమె రెండు పాత్రలు చేస్తున్నారట. ఒకటి నాజుకుగా కనబడే రోల్ కాగా మరొకటి సైజ్ జీరో అనుష్కలా భారీకాయంతో కనిపించే పాత్ర కావడం విశేషం.

రాజమౌళి టాలీవుడ్ టాప్ డైరెక్టర్. తెలుగులోనే కాదు బాహుబలితో ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఎదిగారాయన. ఈ స్టార్ డైరెక్టర్ మీద బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నోరుపారేసుకున్నారు. అసలు జక్కన్న అన్ ప్రొఫెషనల్ , అన్ ఎథికల్ అంటూ ఫైర్ అవుతున్నారు. దసరా కానుకగా విడుదలవుతోన్న ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అనైతికం అంటూ కామెంట్స్ చేసారు బోనీ కపూర్ . ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయం ఒక్కటే కాదు ..5 సంవత్సరాల నాటి ఇష్యూ ఇంకా ఈ ఇద్దరి మధ్యా నలుగుతోందని సౌత్ టు నార్త్ టాక్ నడుస్తోంది.

అసలే సినీ ఇండస్ట్రీ కరోనా సంక్షోభంలో ఉంది కాబట్టి కలెక్షన్లకు ఇబ్బంది తలెత్తకుండా అందరూ చర్చించుకుని క్లాష్ రాకుండా రిలీజ్ లు అనౌన్స్ చేస్తేుంటే .. రాజమౌళి మాత్రం ఇలా చెయ్యడం ముమ్మాటికి తప్పంటున్నారు బోనీకపూర్ . 6 నెలలకు ముందే తన ప్రొడక్షన్ లో అజయ్ దేవ్ గన్ నటిస్తోన్న మైదాన్ మూవీ రిలీజ్ డేట్ అక్టోబర్ 15 అని అనౌన్స్ చేశారు బోనీ. ఇది తెలిసీ ఇలా అనైతికంగా సినిమా రిలీజ్ అనౌన్స్ చెయ్యడం కరెక్ట్ కాదన్నారు బోనీ. రాజమౌళి ఇలా చెయ్యడం ఇప్పుడే కాదు .. 5 ఏళ్ల క్రితం శివగామి క్యారెక్టర్ కోసం శ్రీదేవిని అడిగినప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేశారని… ఏం సమాధానం చెప్పలేదని అంటున్నారు బోనీకపూర్.

రాజమౌళి శివగామి క్యారెక్టర్ కోసం శ్రీదేవిని అడిగినప్పుడు ..చాలాతక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని , అసలు అప్పట్లో శ్రీదేవి ఫుల్ ఫామ్ లో ఉందని , అలాంటప్పుడు అంత తక్కువ రెమ్యూనరేషన్ కి ఎలా ఒకే చెబుతారంటున్నారు బోనీ. శ్రీదేవి ఒప్పుకోలేదని ..శ్రీదేవి గురించి మీడియాలో చాలా తప్పుగా మాట్లాడారని , రాజమౌళి అందుకే అన్ ప్రొఫెషనల్ అని పబ్లిక్ గానే చెబుతున్నారు బోనీకపూర్ . మైదాన్ రిలీజ్ డేట్ విషయం గురించి బోనీ తో డిస్కస్ చెయ్యమని రాజమౌళికి అజయ్ దేవ్ గన్ చెప్పినా .. రాజమౌళి మాత్రం బోనీకపూర్ తో మాటమాత్రం కూడా చెప్పకుండా అక్టోబర్ 13 రిలీజ్ అనౌన్స్ చేసేశారని ఇలాంటి బిహేవియర్ తో రాజమౌళి ఎంత అన్ ప్రొఫెషనలో అర్దమవుతోందటున్నారు బోనీ.

ప్రారంభమైన మొదటిరోజే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సెట్ అగ్నికి ఆహుతైంది. ముంబై నగరంలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ మూవీ కోసం భారీ సెట్ వేయగా…అది మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. కాగా షూటింగ్ స్పాట్ లో ప్రభాస్, సైఫ్ అలీఖాన్ ఆ సమయంలో అక్కడ లేరు. అదృష్టవషత్తూ టీం మెంబర్స్ ఎవ్వరికీ కూడా ఎటువంటి హాని జరుగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్ లో అజయ్ దేవగణ్ బాగం కానున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ రామాయణంలో శివుడిగా ఆయన కనిపిస్తారని తెలుస్తోంది. ఇదివరకే ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది అజయ్ కి. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన తన్హాజీ గతేడాది మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ప్రభాస్ రామునిగా…సైఫ్ అలీఖాన్ రావణుడిగా చేయనున్న ఇదే ప్రాజెక్ట్ లో పరమేశ్వరునిగా నటించేందుకు అజయ్ దేవగణ్ ని ఒప్పించారని టాక్. మరి పార్వతిలా అజయ్ భార్య కాజల్ కనిపిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.