బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి పేరుతెచ్చుకున్న అఖిల్ సార్ధక్ వరుస టాలీవుడ్ ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈమధ్యే మోనాల్ గజ్జర్ తో లీడ్ రోల్ చేస్తూ తెలుగు అబ్బాయి – గుజరాతీ అమ్మాయి అన్న సినిమాను పట్టాలెక్కించాడు. కాగా ఇప్పుడు గోపీచంద్ సీటీమార్ లో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. బిగ్ బాస్ షోతో తన ప్రత్యేకతను చాటుకొని…ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకున్న అఖిల్…ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి నటిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తోన్న సీటీమార్ ను తెరకెక్కిస్తున్నారు మాస్ డైరెక్టర్ సంపత్ నంది. భూమిక ఇందులో కీ రోల్ చేస్తున్నారు. ఈమధ్యే రిలీజైన సీటీమార్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ దక్కింది. అయితే బిగ్ బాస్ ఫేం అఖిల్ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడన్న విషయాన్ని ఇన్నిరోజులు గోప్యంగా ఉంచింది సీటీమార్ టీమ్. ఏప్రిల్ 2న సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.