కింగ్ నాగార్జున త్వరలోనే ఓటీటీ రంగ ప్రవేశం చేయనున్నారు. తనకు రెండు
నేషనల్ స్థాయి వెబ్ సిరీస్ లలో ఛాన్స్ వచ్చిందనీ…అవి రెండూ సూపర్ ఎగ్జయిట్ చేసేవే
అన్నారు నాగార్జున. తాజాగా నాగ్ నటించిన వైల్డ్ డాగ్ సైతం నెట్ ఫ్లిక్స్ రిలీజై ట్రెండ్ అవుతోంది. మరోవైపు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో కాజల్ హీరోయిన్ గా… రా ఎజెంట్స్ నేపథ్యంలో ఓ సినిమాలో నటిస్తున్నారు నాగార్జున. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వెల్ బంగార్రాజులో నటించబోతున్నారు. వీటితో పాటే వెబ్ సిరీస్ లో కనిపించాలనుకుంటున్నారు నాగ్.

అక్కినేని కోడలు సమంతా ముందుగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె హిట్ సిరీస్ ఫ్యామిలిమెన్ 2లో నటించారు. ఇందులో సామ్ ఉగ్రవాదిగా కనిపించనున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సిరీస్ చాలాసార్లు వాయిదాపడింది. ఎప్పుడు విడుదల అన్నదానిపై సరైన క్లారిటీ లేదు. అలాగే ఆహా లో సామ్ జామ్ అంటూ సందడి చేసిన అనుభవం అక్కినేని కోడలికుంది. అంతేకాదు నాగచైతన్య సైతం త్వరలోనే వెబ్ సిరీస్ లో నటించనున్నాడనే వార్త హల్చల్ చేస్తోంది. ఇలా అక్కినేని ఫ్యామిలీ ఒక్కొక్కరిగా ఓటీటీ కోసం బిజీ అవుతున్నారు.