బాలీవుడ్‌ బిగ్ బాంబ్ కంగనా రనౌత్‌ మరోసారి ఫైరయింది. ఎప్పటిలాగానే బీటౌన్ మాఫియా అంటూ గురిపెట్టిన కంగనా.. ఈసారి ఆ రచ్చలోకి అక్షయ్‌ కుమార్‌ని లాగింది. మంచి చేసినా అక్షయ్ చివరికి వార్తల్లో నిలవాల్సివచ్చింది. అక్షయ్‌ వంటి టాప్‌ స్టార్స్‌ చాలామంది తనకు సీక్రెట్ గా ఫోన్‌ చేసి మొచ్చుకున్నారని ట్వీట్ చేసింది. జయలలితగా కంగనా నటించిన తాజా చిత్రం ‘తలైవి’. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌ కు పాజిటివ్ స్పందన లభించింది. జయలలితగా కంగనా ఒదిగిపోయిందంటూ ప్రశంసలు దక్కాయి.

ఆడియన్స్, క్రిటిక్స్…ఇలా అందరూ ప్రశంసిస్తున్నా…బాలీవుడ్ స్టార్స్ మాత్రం తలైవి ఊసెత్తలేదు.
ఈ పరిస్థితుల్లో తాజాగా తనకొచ్చిన రహస్య కాల్స్‌ గురించి కంగనా అభిమానులతో షేర్ చేసుకుంది. తలైవి ట్రైలర్ చూసి బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎందరో తనకు రహస్యంగా విషెస్ తెలియజేసారని వెల్లడించింది. అదే దీపిక పదుకొణే, ఆలియా భట్ వంటి హీరోయిన్లకైతే పబ్లిక్ పొగడ్తలు వస్తాయని…నన్నెవరూ పబ్లిక్ గా మెచ్చుకోరని చెప్పుకొచ్చింది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అక్షయ్ కుమార్ రీట్వీట్ చేయాలి.

మే 28న…బెల్ బాటమ్
సమ్మర్ సీజన్ లో అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ ను షెడ్యూల్ చేశారు నిర్మాతలు. రంజిత్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మే 28న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

దీపావళి పోరు…
వచ్చే దీపావళికి బాలీవుడ్ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. షాహిద్ కపూర్ జెర్సీ, అక్షయ్ కుమార్ పృధ్వీరాజ్ సినిమాలతో పాటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆప్నే 2 కూడా అదే రోజు విడుదలకు సిద్ధమైంది.

ఆలియా కూడా…
దివాళి వేళ అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్లతో పాటూ అలియాభట్‌ కూడా రంగంలోకి దిగనుంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆమె నటిస్తోన్న ‘గంగూబాయి కతియావాడి’ సైతం దీపావళికే రిలీజ్ అంటున్నారు మేకర్స్.

ఎఫ్ఐఆర్ నమోదు…
హెల్మెట్ లేకుండా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టిన వివేక్ ఒబేరాయ్‌పై జుహూ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఐదు వందల రూపాయ‌లు చ‌లానా కూడా విధించారు పోలీసులు.

అమ్మకాల్లో రికార్డ్…
ప్రియాంక చోప్రా స్వయంగా రాసుకున్న ‘అన్ ఫినిష్డ్’ బుక్ అమ్మకాల విషయంలో దుమ్ము రేపుతోంది. ఏకంగా.. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ లో ఆమె ఆటోబయోగ్రఫీ బుక్ స్థానం దక్కించుకుంది.

జనవరి 26న బచ్చన్ పాండేగా అక్షయ్ కుమార్ వచ్చేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. అయితే అది ఈ జనవరి 26 కాదు…2022, జనవరి 26. అవును వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా బచ్చన్ పాండే రిలీజ్ కాబోతుంది. ఫ‌ర్హాద్ స‌మ్జీ డైరెక్షన్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ న‌డియావాలా నిర్మిస్తున్నారు. ఇందులో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. మరో ప్రత్యేకపాత్రలో అర్షద్ వార్సీ కనిపించనున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో హీరో అక్ష‌య్ కుమార్ పిల్లి క‌న్నుతో భ‌యంక‌రంగా ఫోజిచ్చారు.
ప్ర‌తి ఏటా నాలుగైదు చిత్రాలతో అభిమానులని ప‌ల‌క‌రించే అక్‌తయ్… గ‌తేడాది క‌రోనా కారణంగా రాలేకపోయారు. 2021లో మాత్రం వ‌రుస సినిమాలతో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేందురు రెడీఅయ్యారు. ప్ర‌స్తుతం ఈ హీరో చేతిలో అతరంగీ రే, బెల్ బాట‌మ్, సూర్యవంశీ, బ‌చ్చ‌న్ పాండే, ‘పృథ్వీరాజ్ చౌహాన్’ జీవిత చరిత్ర ‘పృథ్వీరాజ్’ తో పాటూ రామ్ సేతు అనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

నేను ఒక్కడిని ఒక వైపు మిగతా హీరోలంతా ఒక వైపు అంటున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఈ సంవత్సరం 5 సినిమాలు రిలీజ్ చేస్తూ  బాలీవుడ్ 2021 బాక్సాఫీస్ షేర్ లో మూడోవంతు నాదే అంటున్న ఈ యాక్షన్ కింగ్  మీద బాలీవుడ్ ఎన్ని వందల కోట్లు ఇన్వెస్ట్ చేసిందో తెలుసా..?

ఒక్క సినిమా చెయ్యడానికే ఆపసోపాలు పడుతున్న బాలీవుడ్ హీరోలున్న ఈ జనరేషన్ లో సంవత్సరానికి మినిమం 3 సినిమాలు ఈజీగా చేసేస్తారు ఈ యాక్షన్ హీరో. లాక్ డౌన్ లో కూడా అందరికన్నా ఫస్టే షూటింగ్స్ కి అటెండ్ అయ్యి బిజీగా అయ్యారు అక్షయ్. సూర్య వన్షీ, బెల్ బాటమ్, రామ్ సేతు, బచ్చన్ పాండే , రక్షాబంధన్ , పృద్విరాజ్ సినిమాలతో ఎంగేజ్ అయిఉన్నారు అక్షయ్. ఈ 2021 కి సంబందించి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మొత్తం బాలీవుడ్ వాటా 1600కోట్లు అయితే అక్షయ్ కుమార్ ఒక్కడిదే 530 కోట్ల వాటా కనిపిస్తోంది.

మామూలుగా సంవత్సరానికి 3 సినిమాలు రిలీజ్ చేసే ఈ కలెక్షన్ కింగ్  ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ బ్యాక్ లాగ్ మూవీస్ తో కలిపి 5 సినిమాల్ని రిలీజ్ టార్గెట్ గా పెట్టకున్నారు. దీని కోసం  బాలీవుడ్ అక్షయ్ కుమార్ వాటా  అక్షరాలా 530 కోట్లు . బాలీవుడ్ భారీ మల్టీ స్టారర్ గా అక్షయ్ , అజయ్ , రణవీర్ కపూర్ లీడ్ రోల్స్ లో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా సూర్యవన్షీ. ఈ సినిమా 170 నుంచి 200 కోట్లు కలెక్షన్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇక ధనుష్ , సారా అలీఖాన్ , అక్షయ్ లీడ్ రోల్స్ లో వస్తున్న అతరంగీ ,రక్షాబంధన్ ఈ రెండు సినమాల ఒక్కొక్కటీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కాకుండా 30 నుంచి 40 కోట్లు, బెల్ బాటమ్ 45 నుంచి 50 కోట్లు, వీటితో పాటు భారీ బడ్జెట్ మూవీ పృథ్విరాజ్ 180 నుంచి 200కోట్ల పెట్టుబడిని అక్షయ్ కుమార్ మీద పెడుతున్నాయి. సో టోటల్ బాలీవుడ్ బాక్సాఫీస్ మొత్తంలో మూడోవంతు అక్షయ్ కుమార్ దే.