బాలీవుడ్ లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతుంది కృతీసనన్. ఆదిపురుష్ లో సీతగా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కృతీ…ఇప్పుడు బుట్టబొమ్మగా నటించే ఛాన్స్ దక్కించుకుందని టాక్. తెలుగు అల వైకుంఠపురంలో బుట్టబొమ్మలా పూజాహెగ్దే మెప్పిస్తే…ఈ మూవీ రీమేక్ హిందీ బుట్టబొమ్మగా కృతీ కనిపించనుందనే వార్త జోరందుకుంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా బాలీవుడ్లో రీమేక్‌ కానున్న సంగతి తెలిసిందే. కార్తీక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా…హీరో వరుణ్‌ ధావన్‌ బ్రదర్ రోహిత్‌ ధావన్‌ ఈ రీమేక్‌ ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులోనే హీరోయిన్ గా కృతీని అడిగినట్టు చెబుతున్నారు.
ప్రజెంట్ వరుణ్‌ ధావన్‌, కృతీ సనన్‌ జంటగా నటిస్తున్న హిందీ మూవీ ‘భేదియా’ ఏప్రిల్‌లో రిలీజ్ కాబోతుంది. మరోవైపు అక్షయ్‌ కుమార్‌ జోడీగా ‘బచ్చన్‌ పాండే’ సినిమాలో నటిస్తుంది కృతీ. ఇటీవలే ప్రభాస్‌ రామునిగా నటిస్తోన్న ప్యాన్‌ ఇండియా ఫిల్మ్ ‘ఆదిపురుష్‌’లో సీత పాత్రకు సెలెక్ట్ అయింది. ఇంత బిజీగా ఉంది కాబట్టే ఓసారి డైరీ తిరగేసి ‘అల వైకుంఠపురములో’ రీమేక్‌ మూవీకి డేట్స్‌ అడ్జస్ట్ చేయాలనుకుంటుందట. జూన్‌లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరి బుట్టబొమ్మగా కృతీనే చిందులేస్తుందా? వేరే హీరోయిన్ సీన్లోకి వస్తుందా? చూడాలి.

గీతా ఆర్ట్స్ ఆఫీస్ అవరణలో బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురం లో…సినిమా రీయూనియన్ బష్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.
2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన అల వైకుంఠపురంలో చిత్రం రికార్డులను తిరగరాసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన ఈ సినిమాని…గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి ప్రొడ్యూస్ చేశాయి.
అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు..తెలుగులో నాన్ బాహుబలి ఆల్ టైం రికార్డు సృష్టించింది అల వైకుంఠపురం లో…
హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ కి సైతం బూస్టప్ ఇచ్చింది ఈ మూవీనే. టబు, జయరాం, సుశాంత్, నవదీప్, నివేతా పేతురాజ్, సముద్రఖని, మురళి శర్మ వంటి అగ్ర తారాగణం నటించారు.
ఇక తమన్ సంగీతం లో రూపొందిన పాటలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలు వైరలే. బుట్ట బొమ్మ యూట్యూబ్ ట్రెండింగ్ గా మారి సంచలనాలకు అడ్డాగా మారింది.

Source: Geetha Arts


ఇన్ని అద్భుతాలకు ఎగ్జాంపుల్ గా నిలిచింది కాబట్టే 1ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, అల్లు అర్జున్, త్రివిక్రమ్, తమన్, సునీల్, సుశాంత్, సముద్రఖని, నవదీప్, నిర్మాత నాగ వంశీ తదితరులు హాజరై హర్షం వ్యక్తం చేశారు.