అలివేలుమంగ – వేంకటరమణ…గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న పేరిది. గోపీచంద్, కాజల్ జంటగా తేజ డైరెక్ట్ చేయబోతున్నారనే ప్రచారం బాగా జరిగింది. ఈ విషయాన్ని ఎవరూ ఖండించలేదు కూడా. అయితే అనూహ్యంగా తెరపైకి తాప్సీ పేరొచ్చింది. దర్శకుడు తేజ… కాజల్ ని తప్పించి తాప్సీని హీరోయిన్ గా కూర్చోబెట్టారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
తాప్సీ పేరు పైకి రాగనే ఈ ప్రాజెక్ట్ నుంచి గోపీచంద్ తప్పుకున్నారనే మరో వార్త హల్చల్ చేస్తోంది. అయితే గతంలో మొగుడు సినిమాలో నటించిన వీరిద్దరి జంట ఫ్లాప్ ని చవిచూసింది. దీంతో గోపీచంద్ కి, తనకి సెట్ కాదని..తాప్సీనే తేజకి సలహా ఇచ్చిందనే గుసగుసలు మొదలయ్యాయి. గోపీచంద్ వేంకటరమణగా కనిపించకుండా వెళ్లిపోడానికి కారణం తాప్సీనే అని కొంతమంది పబ్లిసిటీ ఇస్తున్నారు.
వర్షన్ 2 మరోలా ఉంది. అలివేలుమంగ – వేంకటరమణ…చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట తేజ. అందుకే కాజల్ ని కాదని బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న తాప్సీ పన్నును పట్టుకొచ్చారని టాక్. ఇదే కారణంతో గోపీచంద్ కు కూడా బైబై చెప్పేసి…సౌత్ లోనూ పేరున్న ఓ బాలీవుడ్ హీరో కోసం మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఏదేమైనా అతిత్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారు తేజ. అంతవరకు ఏది నిజమో తేజకే తెలియాలి.