రాజకీయ విభేదాలతో కొంతకాలం దూరంగా ఉన్న పవన్ కల్యాణ్, అలీ ఈమధ్యే కలుసుకున్నారు. అలీ తమ్ముడు ఖయ్యుమ్ బావమరిది పెళ్లికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అంతేకాదు అలీ, పవన్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే అలీ ప్రొడ్యూసర్ గా పవన్ కల్యాణ్ ఓ సినిమాలో నటిస్తారనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. అలీవుడ్ అన్న పేరుతో ఇటీవలే అలీ ఓ ప్రొడక్షన్ హౌజ్ ను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇక ఇదే బ్యానర్ లో పవన్ హీరోగా అలీ సినిమా తీస్తాడనే ప్రచారం జరుగుతోంది.

ఇక పవన్ కల్యాణ్, పూరి జగన్నాథ్ ల కాంబోలో ఎప్పటి నుంచో ఓ సినిమా వస్తుందనే టాక్ బాగా వినిపిస్తోంది. అది ఈ ఏడాదే నిజమయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. నిజానికి మహేశ్ బాబు కోసం సిద్ధం చేసిన ‘జనగనమణ’ స్క్రిప్ట్ ను పవర్ స్టార్ కు అనుగుణంగా మార్పులు చేసారట పూరీ జగన్నాథ్. అన్నీ అనుకున్నట్టు జరిగితే బండ్ల గణేశ్ నిర్మాణంలో ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇదే నిజమైతే వచ్చే ఎన్నికల వరకు దాదాపు 8 చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తారు పవన్ కల్యాణ్.