తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు…రాజమౌళికి లేని తొందర ఐరిష్ నటికి వచ్చిపడింది. దీంతో ఏకంగా తన ఇన్స్ స్టా గ్రామ్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను పోస్ట్ చేసింది. అక్టోబరు 8న ఈ మూవీ విడుదలకానున్నట్టు ప్రకటించింది. అలిసన్ డూడీ అనే ఐరిష్ నటి జక్కన్న ప్రాజెక్ట్ లో కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈమె ఇంతపని చేసింది. అయితే ఈ పోస్ట్ వైరల్ కావడంతో వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది.
పెద్ద సీక్రెట్ ఏమీ బయటపెట్టలేదు అలిసన్. ఎందుకంటే దాదాపు అందరూ అనుకుంటున్నదే. కరోనా కారణంగా వాయిదా పడి దసరా కానుకగా ఆర్ఆర్ఆర్ రాబోతుందన్నది బహిరంగ రహస్యమే. అయితే టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు ముహూర్తం పెట్టుకుంది. ఈలోపే ఆమె బయటపెట్టేసింది. మరి రాజమౌళి ఆ డేట్ కే ఫిక్స్ అవుతారో…మార్చేస్తారో చూడాలి.