చేయని తప్పుకి జైలు జీవితం అనుభవిస్తున్న ఓ యువకుడు ఎలా బయటకు వచ్చాడన్న కథాంశంతో రూపొందిన చిత్రం ‘నాంది’. అల్లరి నరేశ్ హీరోగా…వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసారు. ఈమధ్యే థియేటర్లలో రిలీజై సక్సెస్ టాక్ సంపాదించింది. ఇక అతిత్వరలోనే…అంటే మార్చి 12వ తేదీనే ఆహా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. సతీశ్‌ వేగేశ్న నిర్మించిన నాందితో అల్లరి నరేష్ తన సినీజీవితానికి సరికొత్త నాంది పలికారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతో వరలక్ష్మికి సైతం తెలుగులో అవకాశాలు పెరుగుతున్నాయి. స్నేహితుడిగా నటించిన ప్రియదర్శి సైతం మంచి పేరుతెచ్చుకున్నాడు.

అల్లరి నరేశ్ ముఖ్యపాత్రలో నటించిన నాంది తాజాగా రిలీజైంది. హిట్ టాక్ తో పాటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుందీ చిత్రం. దాదాపు కొన్నేళ్ల నుంచి హిట్ అన్న పదానికి దూరంగా ఉన్న నరేశ్…8ఏళ్ల తర్వాత విజయం దక్కడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన ‘నాంది’ చిత్రం మీడియా సమావేశంలో నరేశ్ భావోద్వేగానికి గురయ్యారు.

2012లో రిలీజైన సుడిగాడు చిత్రమే నరేశ్ కు చివరి హిట్. ఆ తర్వాత విజయానికి నాంది పలికింది ‘నాంది’.
హాస్య పాత్రలనే కాదు…ఎమోషనల్ కంటెంట్ ను కూడా క్యారీ చేయగలనని మరోసారి నిరూపించుకున్నారు నరేశ్. నేను, గమ్యం, శంభో శివ శంభో వంటి చిత్రాల తర్వాత అల్లరి నరేశ్ ను ఇంకాస్త కొత్తగా చూపించిన చిత్రమిది. ఈ సందర్భంగా అందుతున్న పాజిటివ్ రెస్పాన్స్ తో మీడియా సమావేశంతో పాటూ…ఈ సినిమాలో తండ్రిగా నటించిన యాక్టర్, డైరెక్టర్ దేవీప్రసాద్ ను హత్తుకుని ఏడ్చేశారు.

సరికొత్తగా…నూతన కథాంశంతో తన కెరీర్ కు ‘నాంది’ పలికారు అల్లరి నరేష్. అందుకు చేయుతనిచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును టాలెంటెడ్ ‘విజయ్ కనకమేడల’ దర్శకత్వంలో ‘అల్లరి నరేష్’ నటించిన నాంది ట్రైలర్ ను రిలీజ్ చేసారు మహేష్ బాబు. ఈమధ్యే బంగారు బుల్లోడిగా వచ్చినా హిట్ అందుకోలేక ఇబ్బందిపడ్డారు అల్లరి నరేష్. ఇప్పుడీ ప్రయోగాత్మక చిత్రం నాంది తో హిట్ గ్యారంటీ అంటున్నారు. సన్సెన్స్, క్రైమ్ కలగలపిన థ్రిల్లింగ్ అంశాలతో కొత్త జోనర్ లో ఈ మూవీని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.

మంచి కథ దొరకాలే కానీ నటనతో విజృంభిస్తారన్న విషయం నేను, గమ్యం సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు అల్లరి నరేష్. మళ్లీ అలాంటి విభిన్న కథాంశాన్ని డైరెక్టర్ విజయ్ కనకమేడల అందించడంతో వాస్తవికతకు దగ్గరగా అల్లరి నరేష్ అద్దరగొడతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సినిమా “ఫిబ్ర‌వ‌రి 19న” ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శక‌త్వంపై కూడా మంచి అంచనాలున్నాయి. స‌తీశ్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్‌గా నటించారు. ఇటీవలే బ్లాక్ బస్చర్ క్రాక్ సినిమాతో వావ్ అనిపించిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ఈ సినిమాతో కూడా ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు.

నాంది సినిమా ట్రైలర్‌ను శనివారం 10. 08 నిమిషాలకు విడుదల చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు… ట్విటర్‌లో ‘నాంది’ ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని, మూవీ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ కావాలని… అల్లరి నరేష్‌, మూవీయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ హత్య…దాని చుట్టూ అల్లుకున్న పరిణామాలు, ప్రశ్నలు, భావోద్వేగాలు అన్నింటిని ఆస్వాదించాలంటే ఫిబ్రవరి 19 వరకు వేచిచూడాల్సిందే. ఈ సందర్భంగా ఆహాచిత్రం తరపున డైరెక్టర్ విజయ్ కనకమేడల, అల్లరి నరేష్ లతో పాటూ “నాంది” చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ….అభినందనలు.

Source: Lahari Music