చాలారోజుల తర్వాత వార్తల్లో నిలిచాడు అల్లు శిరీష. లవ్ లైఫ్ అండ్ పకోడి అంటీ వస్తోన్న సినిమా ట్రైలర్ లాంచ్ చేసాడు. క‌ల‌ర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ పతాకంపై మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన సినిమా “ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి”. హీరోగా కార్తిక్ బిమల్ రెబ్బ నటించగా సంచిత పొనాచ లేడీ లీడ్ గా కనిపిస్తోంది. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో జయంత్ గాలి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రేమ, పెళ్లి ఎలాంటి రిలేషన్ షిప్ అయినా తమ లైఫ్ కి అడ్డంకి కాకూడదు, స్వేచ్ఛను కట్టిపడేసే బంధనం కాకూడదనుకుంటున్నారు నేటి జనరేషన్. కమిట్ మెంట్స్ అంటే బుల్ షిట్ అంటూ లెట్స్ కీప్ ఇట్ సింపుల్ అనేది కొందరి మాట. ప్రేమ, ఫ్రెండ్ షిప్ కాదు దాన్ని మించిందేదో అంటూ ఇలాంటి బంధాలకు కొత్త పేర్లను ఆపాదిస్తున్న యూత్ ఫుల్ విషయాలన్నీ ఇందులో ఉండబోతున్నాయట. పోస్ట్ ప్రొడక్షన్ తో సహా కార్యక్రమాలన్నీ పూర్తైన “ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి” చిత్రం ఈ నెల 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఇక తాజాగా “ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి” మూవీ ట్రైలర్ ను మెగాప్రొడ్యూసర్ తనయుడు అల్లు శిరీష్ రిలీజ్ చేశారు.