ఏ సౌత్ హీరో కొల్లగొట్టని రికార్డ్ ను అల్లువారబ్బాయి శిరీష్ బ్రేక్ చేసాడు. ఈమధ్యే అల్లు శిరీష్ డాన్సింగ్ సాంగ్ ‘విలయాతి శరాబ్’ యూట్యూబ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో వారం రోజుల్లోనే 92 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసింది. దీంతో ఓ హిట్ హిందీ ప్రైవేట్ ఆల్బమ్ చేసిన ఫస్ట్ సౌత్ హీరోగా శిరీష్ రికార్డ్ సాధించాడు.

ఇక రష్మిక, హన్సిక వంటి స్టార్స్ ను కూడా దాటేసాడు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు చేసిన ప్రైవేట్ వీడియో ఆల్బమ్స్ ఓ రేంజో లో దూసుకుపోయాయి. రష్మిక టాప్ టక్కర్, హన్సిక బూటీ షేక్ వంటి పాటల్ని దాటుకొని విలయాతి శరాబ్ దూసుకుపోతుంది. హెలీ దారువాలతో కలిసి శిరీష్ వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎలాగోలా మొత్తానికి అల్లు శిరీష్ అప్ కమింగ్ సింగర్ పాటతో రికార్డ్ కొట్టేసాడు.