టాలీవుడ్ ప్రముఖులు రాజశేఖర్, ఏఎం రత్నం, శేఖర్ కమ్ముల బర్త్ డే నేడు. ఈ సందర్భంగా వీరికి ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హీరో రాజశేఖర్ బర్త్ డే కానుకగా ఆయన నటిస్తోన్న శేఖర్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. కొత్త దర్శకుడు లలిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఏఎం రత్నం పుట్టినరోజున పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్ తెలియజేసారు. ఖుషి వంటి బంపర్ హిట్ ఉంది వీళ్లద్దరి కాంబినేషన్లో. తాజాగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమాను ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పై ఉంది. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్సు కాగా…చారిత్రక నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు క్రిష్.

సున్నిత భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించే శేఖర్ కమ్ముల ఏప్రిల్ 16న తన లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిదా వంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ స్కూల్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. అందులో సాయి పల్లవి, నాగచైతన్య కాంబినేషన్ కొత్తగా కనిపిస్తోంది. దీంతో బర్త్ డే బాయ్ శేఖర్ కమ్ములకి హిట్ రావడం ఖాయమంటోంది సినీఇండస్ట్రీ.