ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, శృతీ హాసన్ జంటగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం సలార్. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా అన్ని లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ అమేజాన్ ప్రైమ్ గట్టిగా ట్రై చేస్తోందట. ఎన్నడూ లేని విధంగా ఏకంగా వంద కోట్ల రూపాయల భారీమొత్తాన్ని ఆఫర్ చేసినట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్స్ నటించిన చిత్రాలకు సైతం అమేజాన్ ఓటీటీ నుంచి ఈ రేంజ్ ఆఫర్స్ ఇంతవరకు రాలేదట. అయితే ప్రభాస్‌ ఇప్పుడు సౌత్ ప్లస్ నార్త్ టోటల్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకోసమే సలార్ కోసం 100 కోట్లు పెట్టేందుకు రెడీఅవుతోందట అమేజాన్. ప్రసుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీని భారీ రేటుకి దక్కించుకుంది అమేజాన్ ప్రైమ్ ఓటీటీ. ఏప్రిల్ 9న థియేటర్స్ కి రానున్న వకీల్ సాబ్…50రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో ప్రసారం చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు నిర్మాత దిల్ రాజు. అంటే ఈ ఒప్పదం ప్రకారం మే నెలాఖరులో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది వకీల్ సాబ్.

మరోవైపు క్రిష్ డైరెక్షన్లో తాను నటిస్తోన్న సినిమాలో పనిచేసిన మల్లయోధులను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సన్మానించారు. అవివీతిపై పోరుకు మావసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం అవసరమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎంతో కష్టపడుతున్న మల్లయోధులను ప్రోత్సహించి వావ్ అనిపించారు పవన్ కళ్యాణ్.