అమితాబ్ బచ్చన్, రష్మిక మంథన్న కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి గుడ్ బాయ్ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇందులో బిగ్ బీ, రష్మిక తండ్రీకూతుర్లుగా నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. అతిత్వరలో గుడ్ బాయ్ పట్టలెక్కనుంది.

మరోవైపు పాన్ ఇండియా గర్ల్ గా మారుతుంది రష్మిక. తెలుగు, తమిళ్, కన్నడతో పాటు హిందీ భాషలోనూ క్రేజీ సినిమాలు చేస్తోంది. ఇక అమితాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏజ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కాల్ షీట్స్ ఖాళీ లేకుండా గడుపుతున్నారు. మరి వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న గుడ్ బాయ్ ఎలా ఉంటుందో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ సినిమా చేయబోతున్నారనే వార్త జోరందుకుంది. గతంలో ప్రతిబంధ్, ఆజ్ కా గుండా రాజా, ది జెంటిల్ మెన్ వంటి హిందీ చిత్రాలు చేసిన అనుభవం చిరూకుంది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత బిగ్ బి అమితాబ్ కోసం చిరంజీవి సినిమా చేస్తున్నారని సమాచారం. మెగాస్టార్ అడిగిన వెంటనే సైరా లో పాత్ర చేసిన అమితాబ్…ఇప్పుడు చిరంజీవిని రిస్వెస్ట్ చేసారని…చిరూ కూడా వెంటనే అంగీకరించారని తెలుస్తోంది. మరి ఆయన చేస్తున్నది ఫుల్ లెంత్ పాత్రా…గెస్ట్ క్యారెక్టరా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మే 13న రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతుంది. అయితే ఇందులో హీరోయిన్ రెజీనా చిరూ సరసన స్టెప్పులేసినట్టు టాక్. చిరూ, చరణ్ లపై కొరటాల శివ చిత్రీకరించిన ఓ స్పెషల్ సాంగ్ లో రెజీనా కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే దీనిపై అధికార సమాచారం రావాల్సిఉంది.

వరుసగా తన సినిమాల రిలీజ్ డేట్స్ చెప్పేస్తున్నారు ప్రభాస్. షూటింగ్ మొదలవుతుందో లేదో ఆ వెంటనే రిలీజ్ డేట్ ప్రకటించేస్తున్నారు డార్లింగ్ దర్శకనిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన రాధేశ్యామ్ 2021 జూలై 30న రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ సరసన పూజాహెగ్దే హీరోయిన్ లీడ్ చేసిన ఈ సినిమా ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ఫిల్మ్ గా రూపొందింది. కాగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబర్ స్టార్ నటిస్తోన్న సలార్ 2022 ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్నట్టు తాజాగా అనౌన్స్ చేసారు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో వస్తోన్న ఆదిపురుష్ 2022 ఆగస్టు 11న విడుదలే చేస్తామని షూటింగ్ కి ముందే చెప్పేసారు మేకర్స్.

ఇంక డార్లింగ్ సైన్ చేసిన వాటిలో బాకీ ఉంది నాగ్ అశ్విన్ కాంబో మూవీ రిలీజ్ డేట్ మాత్రమే. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్, ప్రభాస్,దీపికా పదుకోనె నటించబోతున్న ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఇవ్వట్లేదు మేకర్స్. ఈమధ్యే జూన్ లేదంటే జూలైలో ప్రభాస్ సినిమా ప్రారంభిస్తామన్నారు నాగ్ అశ్విన్. అయితే ఇది ఓ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ అన్నట్టు మాత్రం తెలుస్తోంది. మరి ఈ మూవీ రిలీజ్ డేట్ బహుశా 2023లో ఉండొచ్చని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఎప్పుడు మొదలెడతారో…ఎప్పుడు రిలీజ్ చేస్తారో ముందు ముందు తెలుస్తుంది.

వరుస సినిమాలతో కుమ్మేస్తున్న ప్రభాస్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఇప్పుడే అప్డేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్, దీపికా కాంబో మూవీపై తాజాగా స్పందించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. జూన్‌- జూలైలో ప్రాజెక్ట్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కరోనా కారణంగా రాధేశ్యామ్ లేట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిందన్నారు. నిజానికి ఫిబ్రవరి – మార్చిలో ప్రారంభించాల్సిన ప్రాజెక్ట్ అని…అయితే అప్పటికే ప్రభాస్ వరుస కమిట్మెంట్స్ ఉండటంతో కొంచెం లేట్ అవుతోందని చెప్పుకొచ్చారు. అయితే దొరికిన టైంలో స్క్రిప్ట్ కి మరిన్ని మెరుగులు దిద్దుకునే అవకాశం దొరికిందన్న నాగ్ అశ్విన్…ఇంతకుమించి ఈ ప్యాన్ ఇండియా మూవీ గురించి ఇప్పుడు చెప్పడం తగదని చెప్పేసారు.

అభిమానుల కోరిక మేరకు జనవరి 29న ఓ న్యూస్ చెప్తానని ప్రకటించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ నేడు ఓ అప్డేట్ రిలీజ్ చేసారు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకోన్ నటించబోతున్న నాగ్ అశ్విన్ పాన్ ఇండియా మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్…డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ డానీ సంచేజ్ లోపేజ్ లకు స్వాగతం పలికారు. మహానటికి పనిచేసిన వీళ్లిద్దరిని…మళ్లీ తన సినిమా కోసం ఆహ్వానిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు నాగ్ అశ్విన్.

ప్రకటించిన దగ్గరినుంచి స్పెషల్ డేస్, పండుగలు వచ్చిపోతున్నాయి…కానీ ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. వరుస ట్వీట్స్ తో మూవీ యూనిట్ సభ్యులని హైజాక్ చేయడం మొదలెట్టారు. అవును నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ నటిస్తోన్న ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి న్యూస్ లేకపోవడంతో ట్వీట్స్ రచ్చ చేసారు డార్లింగ్ ఫ్యాన్స్.


దీంతో దిగొచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్…జనవరి 29న లేదంటే ఫిబ్రవరి 26న ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెబుతామన్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ సినిమానైతే ప్రకటించారు కానీ నెట్ ఫ్లిక్స్ కోసం పిట్టకథల్లోని ఓ కథను తెరకెక్కించడం, నవీన్ పొలిశెట్టితో జాతిరత్నాలు అనే చిత్రాన్ని నిర్మించడం వంటి పనులతో బిజీగా మారారు నాగ్ అశ్విన్. ఇక ఈ రెండు పనులు దాదాపు పూర్తయ్యాయి. సో కాన్సట్రేషన్ మొత్తం ప్రభాస్ మూవీపైనే కేంద్రికరించనున్నారు. అటు ప్రభాస్ కూడా రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్ అంటూ హల్చల్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి ముందుకు రావాలంటే కాస్త సమయం పట్టేట్టుంది. అందుకే ఈలోపు ఓ క్రేజీ అప్డేట్ ను రిలీజ్ చేయబోతున్నారు.

నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబో మూవీలో సెకండ్ హీరోయిన్ గా మాళవిక నాయర్ సెలెక్ట్ అయిందని అంటున్నారు. జనవరి 5న పుట్టినరోజు జరుపుకున్న ఈ భామకు వైజయంతి మూవీస్ శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసే పాన్ ఇండియా మూవీలో మాళవిక కూడా నటించబోతుంది అన్న వార్త ఊపందుకుంది.
ప్రభాస్, దీపికా పదుకొనె లీడ్ పెయిర్ కాగా…బిగ్ బీ అమితాబ్ మరో పాత్రలో కనిపించనున్నారు. ఇంకా చాలామంది స్టార్స్ నటించబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మాళవిక ఛాన్స్ దక్కించుకోడానికి ఓ కారణం ఉంది.


వైజయంతి మూవీస్ నిర్మించిన… నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రమణ్యంతోనే తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మాళవిక నాయర్. వైజయంతి వారితో మంచి అనుబంధం ఉంది ఈమెకి. సూపర్ హిట్ మహనటిలోను కనిపించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. సోలో హీరోయిన్ గా నటించిన కళ్యాణ వైభోగమే, విజేత వంటివి పెద్దగా క్లిక్ కాలేదు. తాజాగా పెళ్లిసందడి 2 లో నటించే అవకాశం వచ్చింది. అయితే మెయిన్ హీరోయినా, సెకండ్ హీరోయినా అన్నది తెలియాల్సివుంది. మరీ టైంలో ప్రభాస్ సరసన ఎంపికైంది అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. మరి త్వరలోనే కాస్ట్ ను అనౌన్స్ చేస్తున్న వైజయంతి మూవీస్….మాళవిక పేరును ప్రస్తావిస్తుందో…లేదో….

తెలుగు, కన్నడలో వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీగా మారిన రష్మికా…తాజాగా బాలీవుడ్ లోనూ పాగా వేసేందుకు స్కెచ్ గీస్తుంది. రీసెంట్ గా సిద్ధార్ద్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న మిషన్ మజ్నుతో తొలి బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది రష్మికా. ఇప్పుడిక అమితాబ్ కూతురిగా మరో సినిమాను అంగీకరించందట. వికాస్ భల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో…అమితాబ్, రష్మికా తండ్రికూతుళ్లగా ఎమోషనల్ జర్నీ చేయబోతున్నారని తెలుస్తోంది.