తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి వరుస బాక్సాఫీస్ హిట్స్ తర్వాత ఆగ్రహం సినిమా భారీ నష్టాలు తీసుకొచ్చింది నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి. ఈ అపజయాన్ని మరిచిపోయేలా ఒక హిట్ కొట్టాలని బలమైన సంకల్పంతో శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిశ్చయించుకున్నారు. ఆ తరువాత అమెరికాకు పయనమయ్యారు .అమెరికాలో న్యూ టెక్నాలజీ మీద ఒక సమావేశం జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్లారు శ్యాంప్రసాద్ రెడ్డి. అక్కడ ఒక వ్యక్తి పరిచయమయ్యారు , అతనే డాక్టర్ లివ్డన్ . తనతో కలిసి శ్యాంప్రసాద్ రెడ్డి గారు తను విజువల్ ఎఫెక్ట్స్ కి పనిచేసిన టెర్మినేటర్ టూ చిత్రం ప్రీమియర్ ని చూశారట. ఆ చిత్రం తనని చాలా ఇన్స్పైర్ చేసిందట భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో టాలీవుడ్ లో మనం ఎందుకు సినిమా తీయకూడదని భావించి ,అదే ఉత్సాహంతో ఇండియాకు పయనమయ్యారు శ్యాం ప్రసాద్ రెడ్డి. తిరిగి వచ్చిన వెంటనే క్షుద్ర పూజలు ,దేవతల మహిమలు, నేపథ్యంలో ఒక గ్రామీణ కథనం సిద్ధం చేసి వర్క్ మొదలుపెట్టారు.

Source: Mallemala tv


ప్రముఖ దర్శకుడు కోదండరామి రెడ్డి గారి దగ్గర పనిచేసిన వై రామారావు కి దర్శకుడిగా అవకాశం ఇచ్చి ప్రాజెక్టు తన చేతిలో పెట్టారు శ్యాంప్రసాద్ రెడ్డి. హీరోయిన్ గా సౌందర్య ,హీరోగా సురేష్, దేవత పాత్రకు రమ్యకృష్ణ, మరో కీలక పాత్ర కు బేబీ సునయన, ఇంకొన్ని పాత్రలకు బాబు మోహన్, కళ్ళు చిదంబరం, ఇలా క్యాస్టింగ్ అంతా సెట్ చేసుకున్నారు సంగీత దర్శకుడిగా చక్రవర్తి, ఛాయాగ్రాహకుడు గా విజయ్ సి కుమార్, వీళ్లతో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకొచ్చి పని చేయించారు.షూటింగ్ ప్రారంభమైంది తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి ప్రాంతాల్లో కొంత భాగాన్ని షూట్ చేశారు .70 రోజుల వర్కింగ్ షెడ్యూల్ అనంతరం జరిగిన మరియు తీసిన సినిమా రష్ చూసిన శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి కంటెంట్ నచ్చలేదు అనుకున్న అవుట్పుట్ రావట్లేదని గ్రహించారు వెంటనే తన సంస్థ కి ఆస్థాన దర్శకుడైన కోడి రామకృష్ణని పిలిచి ఆయన చేతికి సినిమాని అప్పగించారు .ఆ తర్వాత కంప్లీట్ టేకింగ్ మారిపోయింది. విలన్గా రామిరెడ్డి ని తీసుకున్నారు. తీసిన రష్ తో పాటు సాంగ్స్ ని కూడా రీ షూట్ చేశారు కోడి రామకృష్ణ. కొన్ని రోజుల తర్వాత శ్యాం ప్రసాద్ రెడ్డి కి సినిమా కళ్ళముందు కనిపించింది. వాళ్ల బ్యానర్లో క్లాసిక్ సినిమా వస్తుందని అర్థమైంది. తండ్రి ఎం ఎస్ రెడ్డి గారి ఇ మోరల్ సపోర్ట్ తో శ్యాం ప్రసాద్ రెడ్డి గారు ఎక్కడా వెనకాడకుండా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. 400 రోజులకు పైగా ఈ షూటింగ్ చేశారు. శ్యాం ప్రసాద్ రెడ్డి లండన్ కి వెళ్లి అక్కడ సినిమాలకి విఎఫ్ఎక్స్ కి పనిచేసిన పనిచేసిన హాలీవుడ్ టెక్నీషియన్స్తోసిజి వర్క్ చేయించారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ టాలీవుడ్ కి పనిచేయడం ఇదే ప్రప్రథమం. బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్, వైట్ మ్యాట్ వాడారు ఈ సినిమాలో ఒక్కొక్క షాటు కోసం చాలా టేకులు తీసుకున్నారు. స్పెషల్ ఎఫెక్ట్స్ తో పాటు సౌండ్ ఎఫెక్ట్స్ అని కూడా లండన్ లో రూపొందించారు.

Source: Mallemala tv

పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉండగానే టాక్ బీభత్సంగా ఉంది ఇండస్ట్రీ వాళ్ళలో చక్రవర్తి గారు సినిమా లాస్ట్ మూమెంట్ లో ఉండగా అనారోగ్యం బారిన పడడంతో వాళ్ళ అబ్బాయి శ్రీ ఈ ఆర్ ఆర్ పనులు చేశారు. ఈ సినిమాకి మొత్తం ఒక కోటి 80 లక్షలు ఖర్చు అయితే తే ఒక్క గ్రాఫిక్స్ కె ఒక కోటి 20 లక్షలు ఇచ్చారు. 23 నవంబర్ 1995లో అమ్మోరు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మొదటి రెండు వారాలు ఓ మాదిరిగా నడిచింది. ఆ తర్వాత మెల్లగా పుంజుకుని ప్రేక్షకులతో పాటు బాక్సాఫీసుకి కూడా పోలికలు తెప్పించింది. మహిళలకు ఈ సినిమా బీభత్సంగా నచ్చేసింది. టాలీవుడ్ ఫస్ట్ గ్రాఫిక్స్ ఫిలిం ఇదే గ్రాఫిక్స్ లో సినిమా చేయాలంటే కోడి రామకృష్ణ తర్వాత ఎవరైనా అనే విధంగా ఈ సినిమా తనకు అంత పేరు తీసుకొచ్చింది. గ్రాఫిక్స్ ఇంతలా వాడినా తొలి సినిమాగా టాలీవుడ్ లో గొప్ప పేరు తెచ్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది.ఈ సినిమా కోసం సౌందర్య 180 కాల్షీట్లు ఇచ్చారు. సౌందర్య గారికి ఈ సినిమాకి 40 వేలు పారితోషికం ఇచ్చారు సినిమా విడుదలయ్యాక అది అందించిన విజయానికి గాను లక్ష రూపాయలు శ్యాం ప్రసాద్ రెడ్డి గారు కానుకగా ఇచ్చారు అంటే ఈ సినిమా చేసిన విజయాన్ని మనం అంచనా వేయొచ్చు.