దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాలతో పేరుతెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ…ప్రస్తుతం వరుస సినిమాలకు సై అంటూ దూసుకుపోతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ‘పుష్పక విమానం’ నుంచి ‘సిలక’ అంటూ సాగే ఓ లిరికల్ వీడియో సాంగ్ ను అన్న విజయ్ దేవరకొండ చేత ఆవిష్కరింపజేసి…కామ్ గా రెండు మరో రెండు కొత్త సినిమాలను ప్రకటించేసాడు.

ప్రముఖ ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఆనంద్…ఓ సినిమాను అనౌన్స్ చేసాడు. బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని మూవీ ప్రొడక్షన్ లో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను మధురా ఎంటర్ టైన్ మెంట్స్ ఇంకా రోల్ కెమెరా విజువల్స్ కలిసి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అయితే డైరెక్టర్, ఇతర నటీనటులు ఎవరనే వివరాలను త్వరలోనే చెప్తారట.

ఆనంద్ దేవరకొండ ప్రకటించిన మరో మూవీ హై లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది. కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి తెరకెక్కించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులను మరికొన్ని రోజుల్లోనే అనౌన్స్ చేయనున్నారు.

source: aditya music