ప్రతి సినిమాతో ఏదో కొత్తదనాన్ని చూపించాలనుకుంటారు హీరో సుమంత్. కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. అయితే ఈసారి హిట్ పక్కా అనే నమ్మకంతో రౌడీగా బరిలోకి దిగారు. ‘అన‌గ‌న‌గా ఒక రౌడీ’ పేరుతో సుమంత్ హీరోగా ఓ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను… ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ సుమంత్ పుట్టిన‌రోజు సందర్భంగా విడుద‌ల చేశారు దర్శకనిర్మాతలు. షార్ట్ హెయిర్‌ తో కనిపిస్తున్న సుమంత్… బ్లాక్ లుంగీలో చేతులుతో నడుము పట్టుకుని సీరియ‌స్ చూపులతో క‌నిపిస్తున్నాడు.
ఈ కొత్త చిత్రంలో వాల్తేరు శ్రీను పాత్ర‌ చేస్తుననారు హీరో సుమంత్. మ‌ను య‌జ్ఞ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వైజాగ్ షెడ్యూల్ మిన‌హా మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఏక్ దో తీన్ ప్రొడ‌క్‌పన్స్ పతాకంపై గార్ల‌పాటి ర‌మేశ్‌ తో పాటూ డా. టీఎస్ వినీత్ భట్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ సంగీతం అందిస్తున్నారు.