ఫ్రెంచ్ భాషలో సూపర్ సక్సెసైన వెబ్ మూవీ ‘వైట్ టైగర్’ను బేస్ చేసుకొని లైగర్ ను రూపొందిస్తున్నారట పూరీ జగన్నాథ్. రౌడీబాయ్ దేవరకొండ విజయ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ మూవీలో అందాలభామ అనన్య పాండే సైతం ఓ బాక్సర్ గానే నటిస్తోందనే ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో అనన్య పాండేకి… విజయ్ బాక్సింగ్ నేర్పిస్తుంటాడని సమాచారం.

పూరీ గత చిత్రాల్లానే ఈ ప్రాజెక్ట్ లో కూడా హీరో యాటిట్యూడ్ వెరైటీగా ఉండటంతో పాటు పూరీ జగన్నాథ్ తరహా డైలాగ్స్ తో అద్దిరిపోతుందని టాక్. అంతేకాదు ఇందులో పూరీ మార్క్ లవ్ – రొమాన్స్ – ఎమోషన్స్ కాంబినేషన్ కూడా ఎక్కువేనని అంటున్నారు. అదేవిధంగా రౌడీ బాయ్ గత చిత్రాల మాదిరిగానే ముద్దు సీన్స్ హీటెక్కిస్తాయట. ఇక రొమాంటిక్ సన్నివేశాలకే కొదవే లేదని సమాచారం. మరి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో పాటూ విజయ్ దేవరకొండ, అనన్య పాండే లకు కూడా ఇదే ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో అన్ని విధాలుగా అలరించేందుకు టీమ్ కష్టపడుతోంది.

సాలా క్రాస్ బ్రీడ్ అంటూ విజయ్ దేవరకొండని లైగర్ గా ప్రెజెంట్ చేసారు పూరీ జగన్నాథ్. ఇన్నాళ్లు విజయ్, పూరీ కాంబోమూవీ టైటిల్ ఫైటర్ అన్న ప్రచారం జరిగింది. కానీ టైగర్, లయన్ మిక్సింగ్ లైగర్ అన్న పేరును ఫిక్స్ చేసారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ త‌ర్వాత పూరీ, యంగ్ హీరో విజ‌య్ దేవర‌కొండతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూరీ క‌నెక్ట్స్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ బాక్సింగ్ కథాంశంగా రూపొందుతుంది. రియాలిటీ ప్రదర్శించేలా రౌడీ బాయ్ ఈ మూవీ కోసం థాయ్‌లాండ్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా త్వరలోనే తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
పూరి జగన్నాథ్- విజయ్ కాంబో మూవీ లైగర్ లో ఇంకా ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయట. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ కాగా…రమ్యకృష్ణ మరో ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడిక సాలా క్రాస్ బ్రీడ్ అంటూ లైగర్ పోస్ట‌ర్ తో భారీ అంచనాలు పెంచేసారు. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ అక్కడ రిలీజ్ చేస్తుండటంతో నార్త్ లోనూ ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక క‌రోనా కారణంగా ఆగిన ఈ మూవీ షూటింగ్ మ‌ళ్ళీ మొద‌లై శరవేగంగా దూసుకెళ్తుంది.