అంతకుముందు చిన్నా చితకా క్యారెక్టర్స్ చేసినా… సుకుమార్‌ డైరెక్ట్ చేసిన ‘రంగస్థలం’ సినిమాలోని రంగమ్మత్త పాత్రతో క్రేజీ స్టార్ గా మారింది అనసూయ. ఇప్పుడు మళ్లీ సుకుమార్‌ కాంబినేషన్ లో పనిచేసేందుకు సిద్ధమైంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో అనసూయ ఓ కీ రోల్ చేస్తోంది. ‘‘మంచి రోజులు ముందున్నాయి…సుకుమార్‌తో మళ్లీ సినిమా చేయడం హ్యాపీగా ఉంది’’ అని పోస్ట్ చేసింది. ‘పుష్ప’ షూటింగ్ లో అడుగుపెట్టిన సంగతిని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది అనసూయ.

‘పుష్ప’ మాత్రమే కాకుండా రవితేజ హీరోగా వస్తోన్న ‘ఖిలాడి’, కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాల్లో నటిస్తుంది అనసూయ. అలాగే అనసూయ ప్రధానపాత్రలో తెరకెక్కిన డిఫరెంట్ మూవీ ‘థ్యాంక్యూ…బ్రదర్‌’ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది.

బుల్లితెర‌పై తన స‌త్తాను చూపిస్తునే వెండితెరపై వెన్నెల కురిపిస్తోంది యాంకర్ అనసూయ. రంగస్థలం రంగమ్మత్తగా అమాంతం క్రేజ్ పెంచుకొని క్షణంతో నటిగా ప్రూవ్ చేసుకుంది. అప్పుడప్పుడు హాట్ సాంగ్స్ చేస్తూ అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా ఓ విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం రవితేజ ఖిలాడి కోసం ఇటలీ వెళ్లొచ్చిన అనసూయ తాను పవర్ స్టార్ తో కలిసి కనిపించబోతున్నానని చెప్పేసింది.
తాజాగా వ‌కీల్‌సాబ్ మూవీ రిలీజై… ప‌వ‌న్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న సమయంలో అన‌సూయ వాళ్లకి అదిరిపోయే అప్‌డేట్ అందించింది. మీ ఫేవరేట్ హీరోతో నేను చేసే ర‌చ్చ చూసేందుకు రెడీగా ఉండండంటూ ప‌వ‌న్ అభిమానులను రెచ్చగొట్టింది. అవును అనసూయ తనకు తానే పవన్ కల్యాణ్ తో నటించబోతున్నట్టు చెప్పుకొచ్చింది. నిజానికి అత్తారింటికి దారేది చిత్రంలోనే అనసూయ ఐటమ్ సాంగ్ చేయాల్సింది. కానీ అందులో హీరోయిన్ ప్లస్ గ్రూప్ లో ఒకదానిగా కనిపించడం ఇష్టంలేని అనసూయ అవకాశాన్ని వద్దనుకుంది. ప్రజెంట్ క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న హరిహర వీరమల్లులోనే అనసూయ స్పెషల్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు పవన్, అనసూయలపై ఓ ఫోక్ సాంగ్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం.

ఇటలీ మిలాన్ నగరంలో అనసూయ చిల్ అవుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అనసూయ ఇటలీకి ఎందుకు చేరుకుందని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. ఆమె రవితేజ కోసం అక్కడికి వెళ్ళింది. రవితేజతో కలిసి నటిస్తున్న ఖిలాడి షూటింగ్ ఇటలీలోని మిలాన్ సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక పాటతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ అక్కడే ప్లాన్ చేశారట మేకర్స్. అనసూయ కూడా ఆ షూటింగ్ లో దాదాపు పది రోజులకు పైగా పాల్గొనబోతుంది. ఈ యాక్షన్ సన్నివేశాల్లో అనసూయ కూడా కనిపించనుందట. చూస్తుంటే అనసూయకు ఏదో క్రేజీ రోల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

వరుస సినిమాలతో బిజీగా మారుతోన్న యాంకర్ అనసూయ…ఈమధ్యే కార్తీకేయ హీరోగా నటిస్తోన్న చావు కబురు చల్లగా చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసారు. థ్యాంక్యూ బ్రదర్, రంగ మార్తాండా, పుష్ప, ఓ తమిళ్ సినిమా వంటివి ఆమె ఖాతాలో ప్రస్తుతం ఉన్నాయి. అయితే తాజాగా డైరెక్టర్ మారుతీ – హీరో గోపీచంద్ కాంబో మూవీలో అనసూయ ఎంపికయిందనే వార్తలొస్తున్నాయి. అది కూడా ఓ వేశ్య పాత్రలో అనసూయ కనిపించబోతుందంటూ పుకార్లు షికార్లు చేసాయి.

ఆ నోటా..ఈ నోటా చివరికి ఈ విషయం డైరెక్టర్ మారుతీ చెవిన పడింది. దీంతో ఆయన అనసూయ పాత్రపై క్లారిటీ ఇచ్చారు. పక్కా కమర్షియల్ ప్రాజెక్ట్ లో అనసూయ నటించబోతున్నారు. కానీ అందరూ అనుకునే రోల్ మాత్రం కాదని చెప్పేసారు. మంచి కామెడీని పండించే క్యారెక్టర్ అని చెప్పుకొచ్చారు మారుతీ. నేరుగా ఇలా దర్శకుడే రంగంలోకి దిగి ఓ క్లారిటీ ఇవ్వడంతో వేశ్య అన్న రాతలకు తాళంపడింది.

యాంకర్ అన‌సూయ, అశ్విన్ విరాజ్ లీడ్స్ రోల్స్ పోషించిన ‘థ్యాంక్యూ బ్ర‌ద‌ర్’ మూవీ టీజర్ రిలీజైంది. విక్టరీ వెంకటేష్ ఈ టీజర్ ను లాంచ్ చేసారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు డెబ్యూ డైరెక్టర్ ర‌మేష్ రాప‌ర్తి. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి… తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా త్వరలోనే విడుదలకానున్న ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ ఓ యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందినట్టు తెలుస్తోంది. లవర్ బాయ్ గా అశ్విన్ విరాజ్‌..గర్భవతిగా అన‌సూయ లుక్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. కోవిడ్ టైంలో ఈ మూవీని షూట్ చేసారు. ఏమాత్రం పడని ఇద్ద‌రు అపరిచిత వ్య‌క్తులు ఒక లిఫ్ట్ లో ఇరుక్కుపోతే జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఈ మూవీ యూనిట్… త్వ‌ర‌లోనే విడుద‌ల‌ చేసేందుకు స‌న్నాహాలు చేస్తుంది.

కేవలం యాంకర్ గానే కాదు…నచ్చిన అవకాశం వచ్చినప్పుడల్లా సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమంటున్నారు అనసూయ. రంగస్థలం రంగమ్మత్తగా మెప్పించిన దగ్గరి నుంచి ఈవిడకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడలాగే క్రిష్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న పీరియాడిక్ ఫిల్మ్ లో చాన్స్ కొట్టేసారట అనసూయ. పవన్ సరసన ఓ ప్రత్యేక గీతంలో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతకుముందు అత్తారింటికి దారేది మూవీలో స్పెషల్ సాంగ్ కోసం అనసూయను సంప్రదించారు. అయితే ఎందుకో నో చెప్పారు అనసూయ. ఇప్పడిక క్రిష్ సినిమా అదీ పవన్ సరసన అంతా తానై నడిపించే పాట అవడంతో వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది.
వకీల్‌సాబ్‌ షూటింగ్ పూర్తయింది. కాస్త రెస్ట్ తీసుకొని క్రిష్ సినిమాతో బిజీగా మారుతారు. దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు టాక్. ఇక క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న అనసూయ ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగ మార్తాండ’లో నటిస్తున్నారు. అలాగే రవితేజ హీరోగా షూట్ జరుగుతున్న ‘కిలాడి’లో కూడా కనిపించనున్నారు. అంతేకాదు కమెడియన్‌ సునీల్‌ జోడిగా ‘వేదాంతం రాఘవయ్య’ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పారట. తెలుగు నుంచి తమిళ్ ట్రావెల్ చేసి రీసెంట్‌గా అక్కడ క్రేజీ ఆఫర్ దక్కించుకున్నారు. స్టన్నింగ్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు.