ఇటలీ మిలాన్ నగరంలో అనసూయ చిల్ అవుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అనసూయ ఇటలీకి ఎందుకు చేరుకుందని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. ఆమె రవితేజ కోసం అక్కడికి వెళ్ళింది. రవితేజతో కలిసి నటిస్తున్న ఖిలాడి షూటింగ్ ఇటలీలోని మిలాన్ సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక పాటతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ అక్కడే ప్లాన్ చేశారట మేకర్స్. అనసూయ కూడా ఆ షూటింగ్ లో దాదాపు పది రోజులకు పైగా పాల్గొనబోతుంది. ఈ యాక్షన్ సన్నివేశాల్లో అనసూయ కూడా కనిపించనుందట. చూస్తుంటే అనసూయకు ఏదో క్రేజీ రోల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా వకీల్ సాబ్ చిత్రం నుంచి ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. సీరియ‌స్ లుక్‌లో ప‌వన్ కనిపిస్తుడగా… వెనుక నివేథా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల నిల్చుని ఉన్నారు.


మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా విరాట ప‌ర్వం నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేక‌ర్స్. సాయిపల్లవితో పాటూ ఈ ప్రాజెక్ట్ లో మిగిలిన లేడీ లీడ్స్ ను రానా తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేసారు.


అనసూయ నటించిన థ్యాంక్యూ బ్రదర్ మూవీ నుంచి మహిళలను పరిచయం చేస్తూ ఓ ఫోటోను రిలీజ్ చేసారు. స్ట్రాంగ్ ఉమెన్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షాలంటూ కామెంట్ చేసారు.

ఉమెన్స్ డే సందర్భంగా పలువురు సెలెబ్రిటీస్ విషెస్ షేర్ చేసారు. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న త‌ల్లి, స‌తీమ‌ణి, కూతురు ఫొటోను షేర్ చేస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. తన తల్లి కాళ్లు నొక్కుతున్న ఫోటోను నాగశౌర్య పంచుకోగా… అమ్మతో సరదాగా ఉన్న పిక్ ను ధరమ్ తేజ్, తన జీవితంలో ఉన్న సూపర్ ఉమెన్స్ అంటూ సామ్ ఒక ఫోటోను పోస్ట్ చేసారు.


వరుస సినిమాలతో బిజీగా మారుతోన్న యాంకర్ అనసూయ…ఈమధ్యే కార్తీకేయ హీరోగా నటిస్తోన్న చావు కబురు చల్లగా చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసారు. థ్యాంక్యూ బ్రదర్, రంగ మార్తాండా, పుష్ప, ఓ తమిళ్ సినిమా వంటివి ఆమె ఖాతాలో ప్రస్తుతం ఉన్నాయి. అయితే తాజాగా డైరెక్టర్ మారుతీ – హీరో గోపీచంద్ కాంబో మూవీలో అనసూయ ఎంపికయిందనే వార్తలొస్తున్నాయి. అది కూడా ఓ వేశ్య పాత్రలో అనసూయ కనిపించబోతుందంటూ పుకార్లు షికార్లు చేసాయి.

ఆ నోటా..ఈ నోటా చివరికి ఈ విషయం డైరెక్టర్ మారుతీ చెవిన పడింది. దీంతో ఆయన అనసూయ పాత్రపై క్లారిటీ ఇచ్చారు. పక్కా కమర్షియల్ ప్రాజెక్ట్ లో అనసూయ నటించబోతున్నారు. కానీ అందరూ అనుకునే రోల్ మాత్రం కాదని చెప్పేసారు. మంచి కామెడీని పండించే క్యారెక్టర్ అని చెప్పుకొచ్చారు మారుతీ. నేరుగా ఇలా దర్శకుడే రంగంలోకి దిగి ఓ క్లారిటీ ఇవ్వడంతో వేశ్య అన్న రాతలకు తాళంపడింది.

కేవలం యాంకర్ గానే కాదు…నచ్చిన అవకాశం వచ్చినప్పుడల్లా సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమంటున్నారు అనసూయ. రంగస్థలం రంగమ్మత్తగా మెప్పించిన దగ్గరి నుంచి ఈవిడకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడలాగే క్రిష్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న పీరియాడిక్ ఫిల్మ్ లో చాన్స్ కొట్టేసారట అనసూయ. పవన్ సరసన ఓ ప్రత్యేక గీతంలో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతకుముందు అత్తారింటికి దారేది మూవీలో స్పెషల్ సాంగ్ కోసం అనసూయను సంప్రదించారు. అయితే ఎందుకో నో చెప్పారు అనసూయ. ఇప్పడిక క్రిష్ సినిమా అదీ పవన్ సరసన అంతా తానై నడిపించే పాట అవడంతో వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది.
వకీల్‌సాబ్‌ షూటింగ్ పూర్తయింది. కాస్త రెస్ట్ తీసుకొని క్రిష్ సినిమాతో బిజీగా మారుతారు. దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు టాక్. ఇక క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న అనసూయ ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగ మార్తాండ’లో నటిస్తున్నారు. అలాగే రవితేజ హీరోగా షూట్ జరుగుతున్న ‘కిలాడి’లో కూడా కనిపించనున్నారు. అంతేకాదు కమెడియన్‌ సునీల్‌ జోడిగా ‘వేదాంతం రాఘవయ్య’ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పారట. తెలుగు నుంచి తమిళ్ ట్రావెల్ చేసి రీసెంట్‌గా అక్కడ క్రేజీ ఆఫర్ దక్కించుకున్నారు. స్టన్నింగ్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు.

క‌లర్ ఫోటోతో ప్రతినాయకుడిగా మెప్పించి కాస్త జోష్ పెంచారు సునీల్. కమెడియన్, హీరో ఇప్పుడు నెగెటివ్ షేడ్ రోల్స్..ఇలా పాత్ర‌ ఏదైనా నేను ఒదిగిపోగ‌లను అంటున్నారు. తాజాగా సునీల్ హీరోగా ‘వేదాంతం రాఘ‌వ‌య్య’ అనే మూవీ లాంఛ్ అయింది. ఈ చిత్రానికి డైరెక్టర్ హరీశ్ శంక‌ర్ క‌థను అందిస్తుండగా..14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది.
అయితే లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ మూవీలో సునీల్ జోడీగా జబర్దస్త్ బ్యూటీ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ హీరోయిన్ గా ఎంపికైందని టాక్‌. ఇప్పటికే డైరెక్ట‌ర్ సీ చంద్ర‌మోహ‌న్ ఆమెను కలిసి స్టోరీ వినిపించ‌ారని… గ్రీన్ సిగ్న‌ల్ కోసం ఎదురు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక సునీల్ ‘వేదాంతం రాఘవయ్య’కి సాయికార్తీక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. అతిత్వరలో రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో అనసూయ నటిస్తుందా, లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది.