ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో సందడి చేసిన నితిన్…మరో సినిమా అప్ డేట్ ఇచ్చాడు. నితిన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న అంధాదూన్ రీమేక్ నుంచి టైటిల్ లుక్ రిలీజ్ చేసారు. మ్యాస్ట్రో అన్న పేరును ఈ సినిమాకు ఫిక్స్ చేసారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ సైతం వదిలింది మూవీయూనిట్. నభా నటేశ్ నితిన్ సరసన నటిస్తుండగా…తమన్నా మరో లీడ్ రోల్ చేస్తోంది. ఇందులో అంధుడైన నితిన్…మ్యూజిక్ కంపోజర్ గా నటిస్తున్నాడు. అందుకే మ్యాస్ట్రో అన్న టైటిల్ ఖరారుచేసారు. కాగా ఈ సినిమాతో నితిన్ జూన్ 11న థియేటర్స్ కి రానున్నాడు.

బాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ రీమేక్‌ ను తనదైన శైలిలో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. జూన్‌11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అనౌన్స్ చేసారు. కళ్లు కనిపించని సంగీతకారుడిగా నితిన్ నటిస్తోన్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్‌ నభా నటేశ్‌ హీరోకి జంటగా కనిపించనుంది. కాగా విలనీ లుక్ ఇచ్చే టబు రోల్ ను… తమన్నా చేసేందుకు అంగీకరించింది. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై ఎన్‌ సుధాకర్‌రెడ్డి, నిఖిత రెడ్డి కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా హరి కె. వేదాంత్‌ వర్క్ చేస్తున్నారు.

అంధుడైన హీరో ఓ మర్డర్ కు ఎలా సాక్ష్యం చెప్తాడనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. హిందీలో ఈ మూవీతో హీరో ఆయుష్మాన్‌ ఖురానా జాతీయ అవార్డును సొంతంచేసుకున్నారు. మరి నితిన్‌కు కెరీర్ కు ఎలాంటి హెల్ప్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే అతడు దేశద్రోహి అన్న ముద్రతో కనిపిస్తోన్న ‘చెక్’ ఫిబ్రవరి 26న రిలీజ్ కు రెడీఅయింది. కీర్తి సురేశ్ తో చేసిన లవ్ స్టోరీ ‘రంగ్‌దే’ మార్చి 26న విడుదల తేదీని బుక్ చేసుకొంది. ఆపై మరో రెండు నెలలు గ్యాప్‌ తో జూన్ 11న ‘అంధాధున్‌’ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సరి కొత్త అవతారాలని ఎత్తబోతున్నాడు నితిన్. ’20, 40, 60′ అంటూ సందడి చేయబోతున్నాడు. మామూలుగా కమల్ హాసన్ వంటి వారు చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు నితిన్ ట్రై చేస్తున్నాడు. ఇన్నాళ్లు ఉన్న లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ అన్న ఇమేజ్ ను పోగొట్టి నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. అందుకే ‘అంధాదూన్’ రీమేక్ లో అంధుడిగా నటిస్తున్నాడు. ఇక తాజాగా మరో ప్రయోగానికి సై అన్నాడు.
నితిన్ హీరోగా ‘పవర్ పేట్’ అనే ప్రాజెక్ట్ ని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కృష్ణ చైతన్య’ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాకి. ఒక వ్యక్తి నాలుగు దశాబ్ధాల ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే నితిన్…20ఏళ్ల యువకుడిగా, 40ఏళ్ల మధ్య వయస్కుడిగా, 60ఏళ్ల వృద్ధుడిగా కనిపించబోతున్నాడు.
ప్రయోగానికి సై అన్నాడు…సరే…కానీ నితిన్ అలా చూపించాలంటే కరెక్ట్ మేకప్ మ్యాన్ దొరకాలి. ఏదో చేసామన్నట్టు చేస్తే..ఈ కాలం జనానికి ఎక్కదు. అందుకే బాలీవుడ్ ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ ‘రషీద్’ ను నితిన్ కోసం తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ నటిస్తోన్న ’83’మూవీకి ఈయనే మేకప్ మ్యాన్. కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ ను అద్భుతంగా ప్రెజెంట్ చేస్తున్నాడట. అందుకే రషీద్ తో నితిన్ కి టెస్ట్ మేకప్ చేసారట. రిజల్ట్ అదిరిపోవడంతో ఈయన్నే నితిన్ సినిమాకి ఫిక్స్ అయినట్టు సమాచారం. అన్నీ కుదిరితే సమ్మర్ ఎండింగ్ లో పవర్ పేట్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. టాప్ స్టార్స్ లిస్ట్ లో సరైన చోటు సంపాదించేందుకు సఫర్ అవుతున్నారు నితిన్. లవ్ స్టోరీల నుంచి యాక్షన్ , మాస్, థ్రిల్లర్స్..ఇలా ప్రతి జానర్ ట్రై చేస్తూ సక్సెస్ స్ట్రీమ్ లైన్లో కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గతేడాది భీష్మ తో సక్సెస్ కొట్టిన నితిన్ .. రంగ్ దే సినిమాతో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.

ఫ్లాప్ సినిమాల్ని అస్సలు పట్టించుకోకుండా హిట్ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారు నితిన్. అందుకే కెరీర్ లో ప్రయోగాలు చేస్తూ..కంటిన్యూ అవుతున్నారు. లేటెస్ట్ గా నితిన్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో వచ్చిన చెక్ మూవీ టీజర్ చూస్తే .. ఇది 100 పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. రొటీన్ స్టోరీస్ కాకుండా ఆడియన్స్ పల్స్ పట్టుకుని తన కెరీర్ ని కొత్తగా డిజైన్ చేసుకుంటున్నారు నితిన్.

నితిన్ రంగ్ దే, చెక్ మూవీస్ తో పాటు మేర్ల పాక గాంధీ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన థ్రిల్లర్ మూవీ అందాధున్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సీనియర్ హీరోయిన్ తమన్నా, నభానటేష్ లీడ్ రోల్స్ లో నితిన్ అంధుడిగా కనిపించబోతున్న ఈ సినిమా తో మరో ఆసక్తికర మూవీ తెరమీదకి తెస్తున్నారు నితిన్ .

ఈ మూడు సినిమాలు రిలీజ్ కాకుండానే కృష్ణ చైతన్య తో పవర్ పేట మూవీని కూడా లైన్లో పెట్టారు నితిన్. కెరీర్ లోనే ఛాలెంజింగ్ ఫిల్మ్ గా ఉండబోతోందని చెప్పిన నితిన్..ఈ సినిమా స్క్రిప్ట్ కి ఫిదా అయ్యి తనే ప్రొడ్యూసర్ గా మారారు . ఇలా వరుసగా 4 డిఫరెంట్ సినిమాల్ని లైన్లో పెట్టి ఏ క్యారెక్టర్ కి తగ్గట్టు అలా మౌల్డ్ అవుతూ సినిమా మీద తన ప్యాషన్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు నితిన్.