ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో సందడి చేసిన నితిన్…మరో సినిమా అప్ డేట్ ఇచ్చాడు. నితిన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న అంధాదూన్ రీమేక్ నుంచి టైటిల్ లుక్ రిలీజ్ చేసారు. మ్యాస్ట్రో అన్న పేరును ఈ సినిమాకు ఫిక్స్ చేసారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ సైతం వదిలింది మూవీయూనిట్. నభా నటేశ్ నితిన్ సరసన నటిస్తుండగా…తమన్నా మరో లీడ్ రోల్ చేస్తోంది. ఇందులో అంధుడైన నితిన్…మ్యూజిక్ కంపోజర్ గా నటిస్తున్నాడు. అందుకే మ్యాస్ట్రో అన్న టైటిల్ ఖరారుచేసారు. కాగా ఈ సినిమాతో నితిన్ జూన్ 11న థియేటర్స్ కి రానున్నాడు.

బాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ రీమేక్‌ ను తనదైన శైలిలో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. జూన్‌11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అనౌన్స్ చేసారు. కళ్లు కనిపించని సంగీతకారుడిగా నితిన్ నటిస్తోన్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్‌ నభా నటేశ్‌ హీరోకి జంటగా కనిపించనుంది. కాగా విలనీ లుక్ ఇచ్చే టబు రోల్ ను… తమన్నా చేసేందుకు అంగీకరించింది. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై ఎన్‌ సుధాకర్‌రెడ్డి, నిఖిత రెడ్డి కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా హరి కె. వేదాంత్‌ వర్క్ చేస్తున్నారు.

అంధుడైన హీరో ఓ మర్డర్ కు ఎలా సాక్ష్యం చెప్తాడనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. హిందీలో ఈ మూవీతో హీరో ఆయుష్మాన్‌ ఖురానా జాతీయ అవార్డును సొంతంచేసుకున్నారు. మరి నితిన్‌కు కెరీర్ కు ఎలాంటి హెల్ప్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే అతడు దేశద్రోహి అన్న ముద్రతో కనిపిస్తోన్న ‘చెక్’ ఫిబ్రవరి 26న రిలీజ్ కు రెడీఅయింది. కీర్తి సురేశ్ తో చేసిన లవ్ స్టోరీ ‘రంగ్‌దే’ మార్చి 26న విడుదల తేదీని బుక్ చేసుకొంది. ఆపై మరో రెండు నెలలు గ్యాప్‌ తో జూన్ 11న ‘అంధాధున్‌’ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.