ఎఫ్2 బ్లాక్ బస్టర్ హిట్ తో అనిల్ రావిపూడి ఎఫ్3 తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఆల్ మోస్ట్ ఆల్ సేమ్ నటీనటులతో రూపొందిస్తున్నారు. భార్యభర్తల మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో ఎఫ్ 2 తెరకెక్కించగా…ఆ ఫ్యామిలిని డబ్బు పెట్టిన తిప్పలను ఎఫ్3లో చూపిస్తున్నారట.
అయితే ఈ మూవీలోఉన్న ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు కామన్. వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. అయితే ఇందులో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చాడట అనిల్ రావిపూడి. ఆ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాలి చౌహాన్ ను పట్టుకొస్తున్నట్టు సమాచారం.
నిజానికి ఈ సోనాలికి తెలుగు తెర కొత్తెమి కాదు. గతంలో నందమూరి బాలయ్యతో రెండు చిత్రాలు, రామ్ తో ఒక సినిమా చేసింది. అలాగే ఇంకొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా అవకాశాలు రాలేదు. అనిల్ తీసుకున్న నిర్ణయం నిజమైతే ఈ భామ కొంత గ్యాప్ తరువాత మళ్లీ తెలుగులో సందడి చేయబోతుంది.
ఇంతకుముందు కూడా ఎఫ్ 3 విషయంలో మరో హీరో ఉంటాడన్న ప్రచారం జోరుగా సాగింది. రవితేజ, సాయిధరమ్ తేజ్ ఇలా చాలామంది పేర్లే వినిపించాయి. కానీ అవేమి నిజం కాదు…అసలు మూడో హీరోనే లేడన్నారు అనిల్ రావిపూడి. మరిప్పుడు మూడో హీరోయిన్ అన్న న్యూస్ వైరల్ అవుతోంది. మరి సోనాలి నిజంగానే కనిపించనుందా అన్నది దర్శకనిర్మాతలే ప్రకటించాలి.

గత వారమే రిలీజై పోటీలో నుంచి తప్పుకుని నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన సినిమా గాలి సంపత్. పర్వాలేదన్న టాక్ వచ్చినా…థియేటర్ దాకా కాదు కానీ ఓటీటీలో హాయిగా చూడొచ్చనే టాక్ సంపాదించింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రేక్షకుల ఇంటికి తీసుకొచ్చేసారు గాలి సంపత్ మేకర్స్. అయితే మొన్నటివరకు ఆహా ప్లాట్ ఫాంలోనే స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అమేజాన్ లో కూడా అనూహ్యంగా ప్రత్యక్షమైంది గాలి సంపత్. ప్రేక్షకులకు ఎక్కువ రీచ్ అయ్యేలా ఇలా ప్లాన్ చేసారట. ఇంకేం అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో రాజేంద్రప్రసాద్ నటవిశ్వరూపాన్ని చూపించిన గాలి సంపత్ ఆహా, అమేజాన్ ఓటీటీ వేదికలనే…థియేటర్లుగా మలుచుకుని ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్.

మార్చి 11వ తేదీ మహాశివ‌రాత్రి కానుక‌గా మూడు చిత్రాలు థియేటర్స్ కి రానున్నాయి. శర్వానంద్ శ్రీకారం, నవీన్ పొలిశెట్టి జాతి ర‌త్నాలు, శ్రీవిష్ణు గాలి సంప‌త్ సినిమాల విడుదలకు సిద్ద‌మ‌య్యాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు వీటి ప్రీ రిలీజ్ వేడుకలను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందిన లేటెస్ట్ కామెడీ మూవీ జాతిరత్నాలు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాను అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసాడు. జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం వరంగల్ లో గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఇక ఈ వేడుకకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రానున్నార‌ని కామెడి మీమ్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు.


గాలి సంపత్…శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం. దర్శకుడు అనిష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో లవ్‌లీ సింగ్ హీరోయిన్. వీరితో పాటు తనికెళ్లభరణి, రఘుబాబు, సత్య వంటివారు మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించారు. డైరెక్టర్ అనీల్ రావిపూడి స‌మ‌ర్ప‌కుడిగా మారారు ఈ సినిమాతో. గాలి సంపత్ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం 6గంటల‌కు జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్‌ వేదికగా జ‌ర‌గ‌నుంది. అయితే దీనికి ఇస్మార్ట్ హీరో రామ్ చీఫ్ గెస్ట్‌ గా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు

సరిలేరు నీకెవ్వరూ కాంబో మహేశ్ బాబు – అనిల్ రావిపూడి… రిపీట్ కానుందని టాక్. సర్కారు వారి పాట తర్వాత వీళ్లిద్దరి కాంబినేషనే పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాతే రాజమౌళి ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తారట సూపర్ స్టార్. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధానపాత్రల్లో నటిస్తోన్న గాలిసంపత్ సినిమా నిర్మాణంతో పాటూ దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ లతో పాటూ మహేశ్ బాబు కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట అనిల్ రావిపూడి.

పరుశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట చేస్తున్నారు మహేశ్ బాబు. దుబాయ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకొని తాజాగా గోవాకి షిఫ్ట్ సర్కారు మూవీ యూనిట్. అయితే ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్..రాజమౌళితో కలిసి వర్క్ చేస్తారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా అనిల్ రావిపూడి పేరు తెరపైకొచ్చింది. జక్కన్నతో సినిమా అంటే మినిమం 2ఏళ్లు పడుతుంది. అందుకే గ్యాప్ అనే ఫీల్ రాకుండా అనిల్ రావిపూడితో శరవేగంగా ప్రాజెక్ట్ పూర్తి చేసి…రాజమౌళి సెట్ లో అడుగుపెట్టాలన్నది మహేశ్ ప్లాన్. చూద్దాం మరి..ఏం జరుగబోతుందో…

సమ్మర్ లో రిలీజ్ కానున్న ఎఫ్ 3 మూవీలో వెంకీ, వరుణ్ లతో పాటూ మరో హీరో కూడా సందడి చేస్తారన్న వార్త కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతుంది. సినిమా ప్రారంభానికి ముందు మహేశ్‌ బాబు, రవితేజ కనిపిస్తారని వార్తలొచ్చాయి. అయితే ముహూర్తం రోజున అనిల్ రావిపూడి అలాంటిదేమి లేదని క్లారిటీ ఇవ్వడంతో వారి పేర్లు మళ్లీ వినబడలేదు. కానీ మళ్లీ మొన్న గోపీచంద్‌ అన్నారు. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ ఫిక్స్ అయ్యారనే వార్త బాగా వైరలయింది. అయితే తాజాగా ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు అనిల్ రావిపూడి. ఎఫ్ మూవీలో మరో హీరోకి అవకాశమే లేదని…మూడో హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరని క్లారిటీ ఇచ్చారు. నిజానికి తాను అనుకున్న కథలో మూడో హీరోకు ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. సేమ్ టు సేమ్ ఎఫ్ 2 లాగానే ఎఫ్ 3 కూడా వెంకీ, వరుణ్ లతో మాత్రమే తెరకెక్కిస్తానని తెలియజేసారు. కాగా దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2021 సమ్మర్ కానుకగా విడుదలవుతుందని ప్రకటించారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రాజేంద్ర ప్రసాద్ ప్లేస్ లో సునీల్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఎఫ్ 2లో భార్యల మనస్తత్వానికి తోడూ రాజేంద్రప్రసాద్ జతై సినిమా ముందుకు సాగుతుంది. అయితే ఎఫ్ 3లో డబ్బు వలన ఫ్యామిలో ఇబ్బందులు తలెత్తి…వీళ్లకి సునీల్ జతై సినిమాలో ఫన్ క్రియేట్ అవుతోందని తెలుస్తోంది. కాన్సెప్ట్ పోస్టర్ లో డబ్బునే ప్రధానంగా హైలైట్ చేసి విషయాన్ని చెప్పకనే చెప్పేసారు అనిల్ రావిపూడి. చూద్దాం ఈ వేసవిలోనే రిలీజ్ కానున్న ఎఫ్ 3 ఎలా సందడి చేస్తుందో….

ఎఫ్ 2 తో అంచనాలు మించి రికార్డ్ హిట్ అందుకున్న ఎఫ్ 2 మూవీ 2019 సంక్రాంతికి రాగా…ఇంటికొచ్చిన కొత్త అల్లుళ్లలా సరదా చేసి ప్రతిఇంటి ప్రేక్షకులను అలరించారు వెంకీ, వరుణ్. ఇక ప్రస్తుతం సెట్స్ పైనున్న ఎఫ్ 3 2021 దసరా కానుకగా వచ్చేందుకు ముస్తాబవుతుంది. అయితే ఎఫ్2కి, ఎఫ్3కి చాలా విషయాల్లో తేడా వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి వెంకీ, వరుణ్ తేజ్ వంటి స్టార్ కాస్ట్ భారీ రెమ్యూనిరేషన్ అందుకుంటుంది ఎఫ్ 3కి. అలాగే సునీల్, బొమాన్ ఇరానీ వంటివారు అదనపు ఆకర్షణగా కనిపించనున్నారు. దీంతో ఈ మూవీ బడ్జెట్ 70కోట్ల రూపాయలవుతుందని ఓ అంచనా.
ఎంతైతే ఖర్చుపెడుతున్నారో…అంతకు మించి రాబట్టుకోబోతున్నారు నిర్మాత దిల్ రాజు. లో బడ్జెట్ లో నిర్మించిన ఎఫ్ 2…బాక్సాఫీస్ ని కొల్లగొట్టి కాసులు రాల్చింది. అంతేనా ఎఫ్ 3పై భారీగా అంచనాలను పెంచేసింది. దీంతో ఎలాగూ ప్రీ బిజినెస్ బాగా జరుగుతుందనే నమ్మకం ఉంది. ఇక తాజాగా ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఎఫ్3 డిజిటల్ రైట్స్ రికార్డ్ రేటులో అమ్ముడయింది. అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేట్ కి ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. డిజిటల్ రైట్సే ఇంత మంచి రేటుకి పోతే సినిమా బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం ఖాయమంటున్నారు సినీజనాలు.