ఏ మూమెంట్ కోసమైతే అనుష్క, విరాట్ కోహ్లి దంపతులు ఎదురుచూస్తున్నారో అది రానేవచ్చింది. పండంటి పాపకు జన్మనిచ్చింది అనుష్కా శర్మ. దీంతో విరుష్క జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం జాయిన్ అయింది అనుష్కా. కాసేపటి క్రితమే ఆమెకు ఆడపిల్ల జన్మించింది.
జనవరిలో డెలివరీ ఉంటుందని ముందే ప్రకటించారు విరుష్క. ఈ మూమెంట్స్ ను ఎంజాయ్ చేయడానికే ఆస్ట్రేలియా సిరీస్ ను నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు కోహ్లి. ఇక ఇప్పుడు అన్నీ అనుకున్నట్టు జరిగి పాప పుట్టడంతో…ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

2021 కొత్త సంవత్సరంలో కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని కొంతమంది, కొత్త ప్రాజెక్ట్స్ గురించి వెయిట్ చేస్తూ కొంతమంది తెగ వెయిట్ చేస్తున్నారు. కానీ కొంత మంది స్టార్లు మాత్రం అసలు సినిమాలు , రిలీజ్ లు పక్కన పెట్టి ఈ సంవత్సరం తమకు ప్రమోషన్ ఎప్పుడొస్తుందా అని టెన్షన్ పడుతూ ఎదురు చూస్తున్నారు.
కరోనా తెచ్చిన లాక్ డౌన్ లో సెలబ్రిటీలందరూ అసలు సినిమాలు, షూటింగ్స్ లేక ఖాళీ గా టైమ్ పాస్ చేశారు . అందరూ..కాదులెండి.. కొంతమంది మాత్రం పిల్లల్ని కనే పనిలో బిజీగా ఉన్నారు. 2020 లో రాసిన ఎగ్జామ్ కి రిజల్ట్ ని 2021 లో అందుకోబోతున్నారు ఈ స్టార్ పేరెంట్స్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి తమ ఫస్ట్ చైల్డ్ కి ఈ నెలలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు.


2021 లో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ రెండో సారి పేరెంట్స్ అవుతున్నారు. బాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే బెబో ..రోండో సారి తల్లవుతున్నానంటూ ఆగస్ట్ లో అనౌన్స్ చేసింది. ప్రెగ్నెన్సీ అనౌన్స్ మెంట్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన కరీనా కపూర్ అప్పటినుంచి సోషల్ మీడియాలో ఫోటోలతో, వీడియోలతో హడావిడి చేస్తోంది.


నువ్వునేను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇటు తెలుగు, అటు బాలీవుడ్ లో బిజీ అయిపోయిన అనిత హస్సానందిని, రోహిత్ రెడ్డి 2020 అక్టోబర్ లో తమ కమింగ్ బేబీ గురించి అనౌన్స్ చేశారు. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి లోడెలివరీ తో తల్లితండ్రులు కాబోతున్నారు.
ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ,బాలీవుడ్ నటి సాగరికా ఘట్కే జంట .. కూడా ఈ సంవత్సరమే పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు. బాలీవుడ్ అప్ కమింగ్ యాక్టర్ నకుల్ మెహతా భార్య కూడా ఈ ఫిబ్రవరిలోనే బిడ్డ డెలివరీ కోసం వెయిట్ చేస్తోంది. ఇక 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న అదితి షిర్వైకర్ , మోహిత్ మాలిక్ జంట కూడారీసెంట్ గానే తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. రాబోయే సమ్మర్ లో మా బిడ్డను చూస్కోబోతున్నాం అంటున్నారు. ఇలా స్టార్ కపుల్స్ ఎప్పుడెప్పుడు పుట్టబోయే పిల్లల్ని చూస్కుందామా అంటూ తెగ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు.