రేపు తెల్లవారితే ‘రంగ్ దే’, ‘అరణ్య’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రేపు గడిస్తే 27న వీటితో పాటూ రంగంలోకి దిగనుంది ‘తెల్లవారితే గురువారం’ సినిమా. నితిన్, కీర్తి సురేష్ నటించిన రంగ్ దే, రానా ఒంటి చెత్తో నడిపించిన అరణ్య…ఈ రెండు చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. రంగ్ దే కామెడీతో, అరణ్య థ్రిల్లర్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే రంగ్ దే చూసిన దిల్ రాజు, అరణ్య వీక్షించిన సురేష్ బాబు సంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కీరవాణి కొడుకులు కలిసి చేస్తోన్న ప్రయత్నం తెల్లవారితే గురువారంపై కూడా ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో రేపు తెలిసిపోతుంది. పెద్దగా పోటీ లేకపోవడంతో రెండు వారాలుగా జాతిరత్నాలు కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే రత్నాల ఊపు కూడా తగ్గుతుంది. దీనికి తోడు రంగ్ దే, అరణ్య సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ కొట్టినా, లేదంటే రెండు హిట్ టాక్ తెచ్చుకున్నా…జాతిరత్నాలు ఇంక ఓటీటీలో చూడొచ్చులే అనుకునే అవకాశం ఉంది ప్రేక్షకులు. ఏనుగుల నేపథ్యంగా తెరకెక్కిన అరణ్య గెలుస్తాడా…కామెడీనే నమ్ముకున్న నితిన్ హిట్ కొడతాడా…అసలేలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేని శ్రీసింహ తెల్లవారితే దచ్చికొడతాడా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

మనుషుల కంటే ఏనుగులకే తెలివెక్కువంటూ అరణ్య ట్రైలర్ తో దూసుకుపోతున్నాడు రానా దగ్గుబాటి. అంతేకాదు…ఏనులుగు చాలా ఎమోషనల్ అనీ చెప్తున్నాడు. ఆయన హీరోగా నటించిన “అరణ్య” మూవీ ట్రైలర్‌ తాజాగా రిలీజైంది. దీనికి రానా చిన్నాన్న వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. ప్రస్తుతం 10మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ట్రెండింగ్ నంబర్ 1లో ఉంది అరణ్య.
25 సంవత్సరాలుగా అడవిలో గడిపిన ఓ వ్యక్తి స్టోరీతో వస్తున్న చిత్రమిది. ఇందులో విష్ణు విశాల్‌, శ్రియా పిల్గావోంకర్‌, జోయా హుస్సేన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ డైరెక్టర్ ప్రభు సాల్మన్‌. ట్రైలర్‌లో చూస్తున్నట్టుగానే అటవీ నిర్మూలన సంక్షోభ నేఫథ్యంగా అరణ్య రాబోతుందనే విషయం అర్ధమవుతుంది. మార్చి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Eros Now Telugu

పాన్ ఇండియన్ స్టార్ గా మారిన హ్యాండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి…తన కొత్త సినిమా అరణ్యతో మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఆయ‌న నెగ‌టివ్ రోల్ పోషించిన మునుప‌టి హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. దీంతో బాలీవుడ్ లో హాథీ మేరే సాథీ గా రిలీజవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటు తెలుగులో ‘అర‌ణ్య’గా, తమిళంలో ‘కాండన్’ గా థియేటర్లకి వచ్చేస్తుంది.
ప్ర‌భు సాల్మ‌న్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బ‌డ్జెట్ మూవీని తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 26న‌ విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు నిర్మాతలు. “మార్చి 26న మీ ద‌గ్గ‌ర‌ల్లోని థియేట‌ర్‌లో ‘హాథీ మేరే సాథీ/ అర‌ణ్య‌/ కాండ‌న్’ను తీసుకొస్తున్నందుకు మేం ఎంత‌గానో సంతోషిస్తున్నాం! నాపై మీరు చూపించిన ప్రేమ‌, ఓర్పుకు ధ‌న్య‌వాదాలు. మీరంద‌రూ మా మూవీని చూస్తార‌ని వేచి చూస్తుంటాను” అని ట్వీట్ చేశారు రానా.
25 సంవ‌త్స‌రాలుగా ఒక అడవిలో జీవిస్తూ..ఆ అడవే, అడవిలోని జంతువులే తన ప్రపంచంగా బ్రతుకుతున్న ఓ మ‌నిషి క‌థే ‘అరణ్య‌’. ఈ చిత్రంలో ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌లు, అట‌వీ సంక్షోభం గురించి చ‌ర్చించారట. విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రియ పిల్గావోంక‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. శంత‌ను మొయిత్రా సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.