‘కేరాఫ్ కంచెర‌పాలెం’ సినిమాతో మంచిపేరుతెచ్చుకున్న నటుడు కార్తీక్ ర‌త్నం, ప్రస్తుతం బిజీగా మారిన న‌వీన్‌చంద్ర కీలక పాత్ర‌ల్లో న‌టించిన సినిమా అర్థ శ‌తాబ్దం. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజైంది. అద్భుతమైన డైలాగ్స్ తో ప్రేక్షకులని అలరిస్తుంది. న్యాయం, ధ‌ర్మం అవుతుంది… కానీ ధ‌ర్మం ఎప్పుడూ న్యాయం కాదు, ధర్మయుద్ధాలు, స్వతంత్ర్య దేశాలు అంటూ పదునైన బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవ‌ర్ తో వ‌చ్చే డైలాగ్స్ అర్థ శతాబ్ధం సినిమాపై ఉత్కంఠను పెంచుతున్నాయి. డైరెక్టర్ ర‌వీంద్ర పుల్లె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయికుమార్, ఆమని, శుభలేక సుధాకర్, సుహాస్ వంటి తారాగణం నటస్తుంది ఈ సినిమాలో…

Source: Aditya music