స్టుపిడ్ ఎమోషన్స్ లేకుండా స్మార్ట్ గా ఆడితే నిన్ను ఆపేవాడు ఉండంటున్నారు మాస్‌ మహారాజా రవితేజ. ఈ హీరో నటిస్తోన్న తాజా సినిమా ‘ఖిలాడి’. రమేష్‌ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ‘ఉగాది’ ప్రత్యేకంగా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మంచి
టెంపోలో సాగిన ఈ టీజర్‌లో రవితేజ యాక్టింగ్ స్టైల్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
బ్లాక్ బస్టర్ హిట్ ‘క్రాక్‌’ తర్వాత రవితేజ హీరోగా రాబోతున్న మూవీ ఇదే. హీరోయిన్స్ డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి రవితేజ సరసన నటిస్తున్నారు. అనసూయ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈమధ్యే ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఖిలాడి…హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.