విజయనగర సామ్రాజ్యం… శ్రీకృష్ణదేవరాయలు…ఇవి చరిత్ర పదిలంగా ఉన్నంతవరకు నిలిచిపోయే పేర్లు. ఈ రెండు పేర్లతో పాటూ మరొకర్ని సైతం మనం అంత తేలికగా మరిచిపోము. అవును ఆయనే కృష్ణదేవరాయల అష్టదిగ్గజాల్లోని తెనాలి రామకృష్ణ. ఈయన గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మన చిన్నతనంలోని మధుర జ్ఞాపకాలు తెనాలి రామకృష్ణుని కథలు. నేటి తరాన్ని సైతం అవే కథలు నవ్విస్తున్నాయి, ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి.

Video Copyright: A Theorem Studio

ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే…తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజై సూపర్ హిట్టయింది తెనాలి రామకృష్ణపై తెరకెక్కించిన ‘ధీర’. ప్యాన్ ఇండియా లెవల్ 12 భాషల్లో ఈ యానిమేటేడ్ మూవీ విడుదలయింది. ఇప్పటికే ఎన్నో కార్టూన్ షోలు, టీవీ సీరియల్స్ ఇంకా సినిమాలు తెనాలి రామకృష్ణ జీవితాన్ని మనకు పరిచయం చేసాయి. తెలుగులో అక్కినేని హీరోగా ‘తెనాలి రామకృష్ణ’ అనే చిత్రం కూడా వచ్చింది. మరిందులో కొత్తేముంది అనే ప్రశ్న తలెత్తకుండా డైరెక్టర్ అరుణ్ కుమార్ రాపోలు పెద్ద సాహసమే చేసారు. భారతదేశ సినీచరిత్రలో అతి పెద్ద మోషన్ క్యాప్చర్ పిక్చర్ గా ధీరను తెరకెక్కించారు.

బుద్ధి రిద్ది సిద్ధి అనే క్యాప్షన్ తో కేవలం పిల్లలనే కాదు పెద్దలను సైతం అమెజాన్ ప్రైమ్ లో అలరిస్తుంది ధీర. ఇదే డైరెక్టర్ అరుణ్ కుమార్ రాపోలు ఆలోచన కూడా. సినిమా ఆద్యంత చాలా కొత్తగా మలిచి…తెనాలి రామకృష్ణను సరికొత్తగా ప్రెజెంట్ చేయాలని కలలుకన్న డైరెక్టర్ ఆశ నెరవేరిందనే చెప్పాలి. ఈయన స్థాపించిన హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ కంపెనీ ఎ-థియరమ్ స్టూడియో ఈ అద్భుత చిత్రాన్ని నిర్మించింది. ఇక ఇంతవరకు చిన్న మూవీస్ కి ప్రమోషన్స్ చేస్తున్న వివాస్ మీడియా ఈ ప్యాన్ ఇండియా బిగ్గెస్ట్ మోషన్ కాప్చర్ మూవీకి డిజిటల్ పార్టనర్ గా వ్యవహరిస్తుంది.

తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడ ఇలా మొత్తం 12 భాషల్లో 12 మంది సూపర్ స్టార్స్ వికటకవి తెనాలి రామకృష్ణ పాత్రకు తమ గొంతును అరువిచ్చారు. తెలుగులో ‘ధీర’ తెనాలి రామకృష్ణ పాత్రకు బెల్లంకొండ శ్రీనివాస్ వాయిస్ ఓవర్ అందించాడు. హిందీలో వివేక్ ఒబెరాయ్, తమిళ వెర్షన్ కోసం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కన్నడలో ధృవ సర్జ వంటి వారు ‘ధీర’ పాత్రకు వాయిస్ ఓవర్ అందించి సినిమా విజయంలో తమ పాత్ర పోషించారు. మురళి సంగీతం ధీరను మరో స్థాయికి తీసుకెళ్లింది.