ఆదిత్ అరుణ్ హీరోగా పూజిత పొన్నాడ ఫిమేల్ లీడ్ గా రాబోతున్న చిత్రం కథ కంచికి మనం ఇంటికి. జూన్ 11న కథ కంచికి మనం ఇంటికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అనౌన్స్ చేసారు దర్శకనిర్మాతలు. MP ఆర్ట్స్ పతాకంపై డైరెక్టర్ చాణక్య చిన్న తెరకెక్కిస్తున్నాడు. మోనిష్ పత్తిపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా కథ కంచికి మనం ఇంటికి మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఎడిటింగ్ బాధ్యతలు ప్రవీణ్ పూడి తీసుకున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ తేజ డైలాగ్స్ అందించారు. సంగీతం భీమ్స్ సిసిరాలియో కంపోజ్ చేసారు. సినిమాటోగ్రఫీ వైఎస్.కృష్ణ చూసుకున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి టీజర్, ట్రైలర్ వంటివి రానున్నాయి.