చిన్నారి పెళ్లికూతురు…పెద్ద ఆరింద అవతారం ఎత్తింది. బోల్డ్ లుక్ తో అందాల ప్రదర్శనకు తెరలేపింది. స్విమ్ సూట్ లో దర్శనమిచ్చి ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఉయ్యాల జంపాల తర్వాత సినిమా చూపిస్త మావ వంటి ఒకటి, రెండు హిట్ చిత్రాలే అమ్మడి ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తోన్న థాంక్యూ మూవీలో ఓ హీరోయిన్ గా నటిస్తోంది అవికా. విక్రమ్.కె.కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే తన పేరును ఒక్కసారిగా మారుమోగించాలనుకుందో…ఏమో హాట్ ఫోటోను రిలీజ్ చేసింది.
ఒక్కొక్కటిగా తన హద్దులను గత కొన్నిరోజులుగా చెరుపుకుంటూ వస్తోంది అవికా గోర్. ‘ఈ ఇడియట్‌ నావాడు’ అంటూ బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీని పరిచయం చేసింది. ఆ తర్వాత తన బరువు గురించి వచ్చిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుంది. దాదాపు 13కేజీలు తగ్గి ట్రాన్స్‌ఫర్మేషన్‌ అంటే ఏంటో చూపించింది. తనపై పారేసుకున్న నోళ్లను మూయించింది. మధ్యమధ్యలో కొన్ని హాట్ ఫోటోలను పంచుకుంది. అలా అలా తనపై ఉన్న చిన్నారి చూపును…ఇప్పుడు బికినీ ఫోటోతో పూర్తిగా చెరిపేసేందుకు ప్రయత్నించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Avika Gor (@avikagor)


అయితే ఈ ఫోటోకు మిశ్రమ స్పందన వస్తోంది. బరువు తగ్గేందుకు ఆమె చూపిన అంకితభావానికి కూడోస్ అని కొంతమంది అంటుంటే…సినిమా అవకాశాల కోసమే స్కిన్ షో స్టార్చ్ చేస్తుందని ఇంకొంతమంది కూస్తున్నారు. ఇప్పుడిక దర్శకనిర్మాతలు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం ఇస్తారని మరికొందరు పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా అవికా నిర్ణయం…ఆమె స్వంత విషయం..అతిగా మాట్లడొద్దని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎందుకు అవికా…?