అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇద్దరి ఇగోల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్, రానా పోటీపడి మరీ నటిస్తున్నారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా రానా సరసన నటించేందుకు ఐశ్వర్య రాజేష్ ను కన్ఫర్మ్ చేసారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. పవర్ స్టార్ పక్కన హీరోయిన్ గా డేట్స్ కుదరక సాయి పల్లవి రిజక్ట్ చేసిందన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఈ మలయాళ రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ పక్కన హీరోయిన్ గా మరో మలయాళ కుట్టి ‘నిత్య మీనన్‘ ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. నిత్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని…ఇక మిగిలింది సంతకం చేయడమేనని అంటున్నారు. అదొక్కటీ జరిగితే అధికారికంగా నిత్య మీనన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.

తాజాగా వకీల్ సాబ్ డబ్బింగ్ పనులను ముగించుకున్న పవన్ కళ్యాణ్…పాట పాడేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడే కాదు. కొంత టైం తీసుకొని పాట పాడుతానని మాత్రం క్లారిటీ ఇచ్చారు. అది కూడా థమన్ సంగీత దర్శకత్వంలో. పవన్ కళ్యాణ్, రానా కాంబోలో మలయాళీ హిట్ అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇందులోనే పవర్ స్టార్ గొంతు సవరించేందుకు రెడీఅవుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్… స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా థమన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. వకీల్ సాబ్ కి కేవలం మ్యూజిక్ మాత్రమే అందించానని..త్వరలోనే తన సంగీతానికి పవర్ స్టార్ పాడనున్నారని చెప్పుకొచ్చాడు థమన్.

సాయిపల్లవి నుంచి స్టార్ట్ చేస్తే నిత్య మీనన్ వరకు…మధ్యలో నయన్, అనుష్క, కీర్తి సురేష్ లాంటి వాళ్లు కూడా. కట్ చేస్తే వీళ్లలో ఎవరూ ఇంతవరకు ఫైనల్ కాలేదు. దేనికి అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ కోసం సాగిస్తున్న హీరోయిన్ల వేటలో ఏ ఒక్క భామ చిక్కడం లేదు..ఎందుకిలా ? పవర్ స్టార్ కి హీరోయిన్ కరువేంటి?

పవర్ స్టార్ సరసన నటించే హీరోయిన్ కావాలి. కండీషన్ లేకుండా ఎస్ చెప్పాలి. పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కతున్న అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ గురించి తెలిసిందే. ఇందులో రానా జంటగా ఐశ్వర్యా రాజేష్ ఓకే అయినట్టే. కానీ పవన్ పక్కన నటించడానికి…ఎవరిని చూసుకున్నా ఏదో సమస్య వచ్చిపడుతుంది. ముందు నుంచి సాయి పల్లవి పేరు బాగా వినిపించింది. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నానంటూ సున్నితంగా తప్పుకున్నారు సాయి పల్లవి.

బంతి కొన్నిరోజులు నయన్ కోర్టులో ఆగింది. కానీ నయనతార ఎక్సెప్ట్ చేస్తున్న భారీ రెమ్యునిరేషన్ మేకర్స్ భరించలేమన్నారని టాక్. సరే అనుష్కను తీసుకుందాం అంటే ఆమె రెండు నెలల తర్వాత కానీ కాల్ షీట్స్ ఇచ్చే ఆలోచనలో లేరు. తమన్నా, కీర్తి సురేష్, త్రిషా వీళ్లంతా పవన్ పక్కన ఆల్రెడీ నటించేసారు. పైగా వీళ్లు పవన్ జోడిగా చేసిన సినిమా ఫలితాలన్నీ తేడా కొట్టాయి.

డైరెక్టర్ సాగర్ చంద్ర ప్రస్తుతం నిత్య మీనన్ లేదంటే రాశీ ఖన్నాను పవన్ పక్కన ఫిక్స్ చేసేందుకు ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ఇంకేదైనా బెటర్ మెంట్ ఆలోచన ఉందా అని కూడా మరోసారి థింక్ చేస్తున్నారు. అసలిక్కడొచ్చిన అసలు సమస్య వేరే ఉంది. సినిమా స్టోరీ ప్రకారం హీరోయిన్ ఓ బిడ్డ తల్లిగా కనిపించాలి. అందుకే ట్రెండీ హీరోయిన్స్…అంత త్వరగా ఎస్ చెప్పట్లేదని అంటున్నారు. సో..ఇలా పవన్ కోసం హీరోయిన్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఎవరి దగ్గర వేట ఆగుతుందో చూడాలి.

వకీల్ సాబ్ షూటింగ్ పూర్తైన తర్వాత రానాతో కలిసి అటు అయ్యప్పనుమ్..కోషియుమ్ రీమేక్…ఇటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు పవన్ కల్యాణ్. అయితే బందిపోటు, వీరమల్లు, విరూపాక్ష వంటి టైటిల్స్ క్రిష్ కాంబో మూవీ కోసం సెట్ చేసారనే ప్రచారం జరిగింది. అయితే చివరికి ‘హరహర మహాదేవ్’ అన్న పేరును ఫిక్స్ చేసారట. దీనికోసం ఇప్పటికే ఫిల్మ్ నగర్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించినట్టు వార్తలొస్తున్నాయి.

పవర్ స్టార్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్ గా ఎంపికవగా…మరో హీరోయిన్ గా బాలీవుడ్ సోయగం జాక్వలిన్ ఫెర్నాడెజ్ ను కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. అయితే మరో స్పెషల్ సాంగ్ కోసం హాట్ యాంకర్ అనసూయను కూడా సంప్రదించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయ్యప్పనుమ్..కోషియుమ్ రీమేక్ కోసం కేవలం నెలన్నర డేట్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్…క్రిష్ కోసం మార్చి లేదా ఏప్రిల్ నుంచి నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటారట. ఏకబికిన షూటింగ్ పూర్తి చేసి ఏడాది చివరికల్లా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేస్తారట క్రిష్. అంతా అనుకన్నట్టు జరిగితే 2022 సంక్రాంతి బరిలో ఈ మూవీ కూడా దిగుతుందని అంటున్నారు.