జనవరి 26న బచ్చన్ పాండేగా అక్షయ్ కుమార్ వచ్చేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. అయితే అది ఈ జనవరి 26 కాదు…2022, జనవరి 26. అవును వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా బచ్చన్ పాండే రిలీజ్ కాబోతుంది. ఫ‌ర్హాద్ స‌మ్జీ డైరెక్షన్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ న‌డియావాలా నిర్మిస్తున్నారు. ఇందులో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. మరో ప్రత్యేకపాత్రలో అర్షద్ వార్సీ కనిపించనున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో హీరో అక్ష‌య్ కుమార్ పిల్లి క‌న్నుతో భ‌యంక‌రంగా ఫోజిచ్చారు.
ప్ర‌తి ఏటా నాలుగైదు చిత్రాలతో అభిమానులని ప‌ల‌క‌రించే అక్‌తయ్… గ‌తేడాది క‌రోనా కారణంగా రాలేకపోయారు. 2021లో మాత్రం వ‌రుస సినిమాలతో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేందురు రెడీఅయ్యారు. ప్ర‌స్తుతం ఈ హీరో చేతిలో అతరంగీ రే, బెల్ బాట‌మ్, సూర్యవంశీ, బ‌చ్చ‌న్ పాండే, ‘పృథ్వీరాజ్ చౌహాన్’ జీవిత చరిత్ర ‘పృథ్వీరాజ్’ తో పాటూ రామ్ సేతు అనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి.