‘ బ్యాక్ డోర్ ‘ …నంది అవార్డు విన్నర్ కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ డిఫరెంట్ మూవీ. హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్
చేసిన ఈ సినిమాని.. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యంగ్ హీరో తేజ త్రిపురణ మరో ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా హైదరబాద్ ఫిల్మ్ నగర్ లోని దుబాయ్ హౌస్ లో ‘ బ్యాక్ డోర్ ‘ షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టారు.
పూర్ణ కెరీర్ లో మైల్ స్టోన్ గా మిగిలే ఫిల్మ్ “బ్యాక్ డోర్”. ఓ మహిళ తన కంటే వయసులో చిన్నవాడైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం…దానివల్ల ఎదురయ్యే పరిణామాల కథాంశంతో సాగే సినిమా ఇది. పూర్ణ మెచ్యూర్ నటన ‘బ్యాక్ డోర్” మూవికే హైలైట్” అని డైరెక్టర్ కర్రి బాలాజీ అన్నారు.
నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ‘డైరెక్టర్ గా బాలాజీకి ఎంతో మంచి పేరు తెచ్చే చిత్రం ‘”బ్యాక్ డోర్”. నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి బాలాజీ ఓ రేంజ్ లో అవుట్ పుట్ రాబట్టుకుంటున్నారు” అని వివరించారు.
ఇక నటి పూర్ణ మాట్లాడుతూ.. “నేను వర్క్ చేసిన దర్శకుల్లో బాలాజీగారు ది బెస్ట్ అని…ప్రతి సీన్ ఓ ప్లానింగ్ తో, క్లియర్ గా తీసారని .. హీరోయిన్ గా తనకు, దర్శకుడిగా బాలాజీకి పేరుతోపాటు… ఎంతో సహనంతో “బ్యాక్ డోర్” ఫిల్మ్ నిర్మిస్తున్న నిర్మాత శ్రీనివాస్ రెడ్డి గారికి బోలెడు డబ్బు తెచ్చే సినిమా ఇది” అన్నారు.