రష్మిక అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు…చివరకు కొరియన్ భామను సెట్ చేసారంటున్నారు భారీచిత్రాల దర్శకుడు శంకర్. ఆయన డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో చెర్రీ సరసన దక్షిణ కొరియా హీరోయిన్‌ సుజి నటించబోతుందనే వార్త హల్చల్ చేస్తోంది. నడిచే ఫ్యాషన్ హౌజ్ అని కొరియన్ ఫ్యాన్స్ ఈమెను ముద్దుగా పిలుచుకుంటారు. ఈమె హీరోయిన్ మాత్రమే కాదు పాప్ సింగర్ కూడా. కొరియన్ దేశాల్లో సుజికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా ఇందులో మరో ఇండియన్ హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉందంటున్నారు. భారతీయుడు 2 ఆగిపోవడంతో…రకుల్ కాల్షీట్స్ ను ఈ సినిమాకు వాడుకుందామని అనుకుంటున్నారట శంకర్. అయితే దీనికి చరణ్ ఓకే చెప్పారా లేదా అన్నది తెలియాల్సిఉంది.