మెగా బ్రదర్ నాగబాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా విలన్ పాత్రతో. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనే ప్రతినాయకుడిగా నాగబాటు నటిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో షూట్ లోని కొన్ని ఫోటోలు సైతం బయటికొచ్చాయి. అతిత్వరలో అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావచ్చు.

బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘అల్లుడు అదుర్స్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలకానుంది. సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటించారు.  అనుబంధాలకు విలువనిచ్చే ఓ అల్లుడి కథతో… తన కుటుంబం కోసం హీరో ఎలాంటి పోరాటం సాగించాడన్నది ఆకట్టుకునేలా దర్శకుడు సంతోష్‌శ్రీనివాస్‌తీర్చిదిద్దాడట. బెల్లంకొండ శ్రీనివాస్‌పాత్ర  మాస్‌, క్లాస్‌వర్గాల్ని అలరించేలా ఉంటుంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్నది. సంక్రాంతికి చక్కటి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని తెలిపింది చిత్రయూనిట్. ప్రకాష్‌రాజ్‌, సోనుసూద్‌, వెన్నెల కిషోర్‌ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.