భారతీయుడు-2 షూటింగ్ మళ్లీ మొదలు కానుందని టాక్. ఇప్పటికే 60 పర్సెంట్ చిత్రీకరణ పూర్తయిందని.. మిగిలిన పార్ట్ కూడా త్వరగా స్టార్ డైరెక్టర్ శంకర్ పూర్తి చేస్తారని టాక్. ఐ, రోబో 2.0 చిత్రాల తర్వాత శంకర్ కి బ్యాడ్ టైమ్ నడుస్తోందని బాగా వార్తాలొచ్చాయి. ఈ క్రమంలోనే పలు కారాణాల వల్ల వాయిదాపడుతూ వస్తోన్న భారతీయుడు 2 ఇక మళ్లీ పట్టాలెక్కే పరిస్థితి లేదనీ చెప్పుకొన్నారు. అందుకు తగ్గట్టే రామ్ చరణ్ తో తన 15వ సినిమాను ప్రకటించి వార్తల్లో నిలిచారు శంకర్.

దిల్ రాజ్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం భారతీయుడు చెక్ పెట్టడంలేదట శంకర్. మిగిలిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసి…దగ్గరుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకొని…రిలీజ్ డేట్ ప్రకటించాకే చెర్రీ మూవీ కోసం వర్క్ చేస్తారట శంకర్. కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు.