30 ఏళ్ల క్రితం రిలీజైన మైనే ప్యార్ కియా సినిమా గుర్తుంది కదా…ఆ సినిమాలో తన అందచందాలతో అలరించి, కుర్రాళ్లు ఆరాధించిన హీరోయిన్ భాగ్య‌శ్రీని ఎవ్వరూ అంత తొందరగా మర్చిపోలేరు. అప్పటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ ఇప్పుడు త‌లైవి త‌ల్లిగా తన సరికొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. 11 ఏళ్ల అనంతరం బాలీవుడ్‌ రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. జ‌య‌ల‌లిత బయోపిక్ ఆధారంగా రూపొందిన త‌లైవి చిత్రంలో కంగ‌నా త‌ల్లి పాత్రలో నటించారు. మంగ‌ళ‌వారం విడుదలైన తలైవి మూవీ ట్రైల‌ర్‌ ను తీక్షణంగా గమనిస్తే…ఒక్కసారి ఆమె తళుక్కున కనిపించడం చూడొచ్చు. ప్రస్తుతం 52ఏళ్ల వయసున్న భాగ్య‌శ్రీ సునీల్‌శెట్టి హీరోగా నటించిన రెడ్ అలెర్ట్ మూవీలో చివరిసారి న‌టించారు. ఆపై 2019లో ఓ క‌న్న‌డ చిత్రం చేసినా.. బాలీవుడ్ సినిమా చేయడం మాత్రం ఇదే మొదటిసారి. నిజానికి ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రం ద్వారా భాగ్యశ్రీ తెరపై మళ్లీ కనిపిస్తుందనుకున్నారు. కానీ అంతకన్నా ముందే తలైవి ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక తాజాగా కంగ‌నా పుట్టినరోజు సంద‌ర్భంగా ఇద్దరు కలిసున్న మూవీలోని ఓ పిక్ ను షేర్ చేసారు భాగ్య‌శ్రీ.