బిగ్ బాస్ ఫినాలేలో మాటిచ్చినట్టుగానే ఒక్కొక్కరికి ఒక్కో అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా మెహ‌బూబ్‌కు ఆచార్య‌లో కీ రోల్ పోషించే ఛాన్స్ ఇచ్చారట చిరూ. ఇందులో జానపద నృత్యకారుడిగా..మెహబూబ్ పాత్ర ఎమోషనల్ గా ఉంటుందని టాక్. ఇంట్రవెల్ కి ముందు చనిపోయే పాత్రతో ఓ రేంజ్ ట్విస్ట్ ఇస్తాడట మెహబూబ్.

మామ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంటే…అల్లుడు స్నేహ ధర్మాన్ని పాటిస్తున్నాడు. మంచు మనోజ్ అహం బ్ర‌హ్మాస్మి సినిమాలో గెస్ట్ రోల్‌ చేసేందుకు సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పాడ‌ట‌. పాత్ర వ్య‌వ‌థి త‌క్కువే అయినా సినిమాను మ‌లుపు తిప్పే పాత్ర అని స‌మాచారం. మనోజ్, సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అందుకే ఫ్రెండ్ కోసం కాదనకుండా అహం బ్రహ్మాస్మీ అంటున్నాడు తేజ్. కాగా మంచు మనోజ్ కిది కమ్ బ్యాక్ మూవీ. అహం బ్రహ్మాస్మీ రిజల్ట్ పై మనోజ్ సినీ కెరీర్ ఆధారపడిఉంది.

మెగాస్టార్ చిరంజీవి…సినిమాలతో ఎంత పాపులారిటీ సంపాందించారో…తన మంచితనం, ఛారిటీ ద్వారా అంతే అభిమానాన్ని దక్కించుకున్నారు. రాజకీయాల అసలైన రాజకీయం తెలియక..ఆయన ఇప్పటి జనానికి ఇంకోలా అర్ధమైనా…మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే.

తాజాగా జరిగిన స్టార్ మా బిగ్ బాస్ లో ఎవరు గెలిచారు…ఏం హైలటయింది అంటే చిరంజీవి అనే చెప్పొచ్చు. వేరేవాళ్లు కుదరక విచ్చేసినా…నాగార్జున పట్టుబడితే వచ్చినా షోను మొత్తం స్టీల్ చేసారు. సోహెల్, మెహబూబ్ లకు అప్పటికప్పుడు 10లక్షలు ప్రకటించేసి…మీరు కష్టపడి గెలుచుకున్న డబ్బుని మీ తల్లిదండ్రులకి ఇవ్వండి…మీరు చేయాలనుకున్న ఛారిటీ కోసం నేను డబ్బిస్తానంటూ చెక్ ని సైతం అందించేసారు.

అక్కడితో ఆగిపోలేదు చిరంజీవి. సోహెల్ సినిమా తీస్తానంటే…ఆ సినిమాకు నేనొచ్చి ప్రమోట్ చేస్తానని, వీలైతే అందులో ప్రత్యేక పాత్రలో నటిస్తానని కోట్లాదిమంది చూస్తుండగా మాటిచ్చారు. దివికి తాను నటించే లూసిఫర్ రీమేక్ లో అవకాశం ఇచ్చారు. ఇలా తన మంచితనాన్ని చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఇదే షోలో కొడుకు విన్నర్ గా నిలిచినా…అభిజిత్, అఖిల్.. ఇద్దరిని ఒకేలా ఆశీర్వదించి తను ఆదర్శంగా నిలిచారు అభిజిత్ తల్లి. నాగార్జున, చిరూలా మీరిద్దరూ పైకి రావాలని ఆమె అన్నారు. దానికి అది ఎప్పటికీ సాధ్యం కాదంటూ అభిజిత్ స్పందిస్తే…ఎందుకు కాదంటూ చిరంజీవి బదులిచ్చారు. యంగ్ టాలెంట్స్ ఎప్పటికీ అలా మాట్లాడొద్దనీ…కృషి చేస్తే ఎవరైనా పైకొస్తారని వాళ్లలో ధైర్యాన్ని నింపారు చిరంజీవి. ఇలా బిగ్ బాస్ ఫినాలెకి విచ్చేసి మెగా సందడి చేసారు చిరంజీవి.