మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఓ విషయంలో పోటీపడుతున్నారట. ఇద్దరికీ ఒకే హీరోయిన్ కావాలంటూ సందడి చేస్తున్నారట. ఇదంతా సరదాగా తీసుకున్నా నిజానికి మాత్రం బాలీవుడ్ దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ ఇద్దరు సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ రజినీకాంత్ వంటి సీనియర్ హీరోతో లింగా సినిమా చేసిన సోనాక్షి అయితేనే వీళ్లకి కూడా బాగుంటుందని అనుకుంటున్నట్టు టాక్.

చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా హీరోయిన్ గా కనిపించనుందట. ఇటు మలినేని గోపిచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న సినిమాలోనూ సోనాక్షినే హీరోయిన్ అన్న ప్రచారం జరుగుతుంది. అయితే రెండు చిత్రాల మేకర్స్ ఇప్పటికే సోనాక్షిని కలిసారని…ఆమె కూడా పాజిటివ్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఈ విషయాలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి…నెక్ట్స్ లూసిఫర్ రీమేక్ పనులను షురూ చేయనున్నారు. మోహన్ రాజా డైరెక్ట్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో నటించనున్నారు. అయితే ఈ రెండు కాకుండా డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు చిరంజీవి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. అయితే ఈ చిత్రంలో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి చిరూకి ధీటుగా విలన్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఉప్పెనలో విజయ్ నటనకు ముగ్ధుడైన చిరూ…అడిగిమరీ విజయ్ సేతుపతిని ప్రతినాయకుడిగా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం.

చిరూ విలన్ సంగతలా అంటే ఎప్పటినుంచో సరైన ప్రతినాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు బోయపాటి – బాలకృష్ణ. అయితే వీరిద్దరి మూడో కాంబోమూవీలో విలన్ గా సునీల్ శెట్టి దాదాపు ఫిక్స్ అయనట్టేనని టాక్. త్వరలోనే ఆయన బాలయ్యతో పాటూ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. జగపతిబాబు, శ్రీకాంత్, అర్జున్…ఇలా చాలామందిని అనుకొని చివరికి సునీల్ శెట్టి దగ్గర ఆగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అఘోరా వేషంలో షూటింగ్ చేస్తున్న బాలయ్యబాబు…త్వరలోనే సునీల్ శెట్టిని ఢీకొట్టే సీన్స్ లో నటించనున్నారు.

చిరూ నటిస్తోన్న ఆచార్య షూటింగ్ క్లైమాక్స్ కొచ్చేసింది. షూటింగ్ పూర్తైన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరపనున్నారు. ఎందుకంటే మే 13న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఆచార్య తర్వాత…చిరూ మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయనున్నారు. అయితే ఈ రెండు చిత్రాలతో బిజీగా ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి.

తాజాగా ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చిరూ…తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ సీక్రెట్ బయటపెట్టేసారు. బాబీగా పిలుచుకునే డైరెక్టర్ కేఎస్.రవీంద్రతో కలిసి సినిమా చేయబోతున్నానని ప్రకటించారు చిరంజీవి. లూసిఫర్ తర్వాత బాబీ దర్శకత్వంలో తాను చేయబోయే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని కూడా తెలియజేసారు. ఇలానే ఓ పిట్ట కథ వేడుకలో ఆచార్య టైటిల్ ను రివీల్ చేసారు చిరూ. అందుకే ఆయన్ని బోళా మనిషిగా అభివర్ణిస్తుంది సినీఇండస్ట్రీ.