మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్…బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్దే అఖిల్ సరసన నటించింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. కాగా జూన్ 19వ తేదీన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుద‌ల‌కు మేక‌ర్స్ ప్లాన్ చేయగా, అందుకోసం ప్రమోషన్స్ మొదలుపెట్టరు మేకర్స్.

లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి వాలెంటైన్స్ డేను టార్గెట్ చేసారు. ప్రేమికుల దినోత్సవ కానుకగా సంగీత దర్శకుడు గోపీ సుంద‌ర్ రాగం కట్టిన రొమాంటిక్ పాట గుచ్చే గులాబీలాగాను విడుద‌ల చేశారు. అనంత శ్రీరామ్, శ్రీమ‌ణి లిరిక్స్ అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. లవర్స్ ప్లస్ మ్యూజిక్ లవర్స్ అందరినీ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సాంగ్.

Source: Aditya music