రాజమౌళి టాలీవుడ్ టాప్ డైరెక్టర్. తెలుగులోనే కాదు బాహుబలితో ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఎదిగారాయన. ఈ స్టార్ డైరెక్టర్ మీద బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నోరుపారేసుకున్నారు. అసలు జక్కన్న అన్ ప్రొఫెషనల్ , అన్ ఎథికల్ అంటూ ఫైర్ అవుతున్నారు. దసరా కానుకగా విడుదలవుతోన్న ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అనైతికం అంటూ కామెంట్స్ చేసారు బోనీ కపూర్ . ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయం ఒక్కటే కాదు ..5 సంవత్సరాల నాటి ఇష్యూ ఇంకా ఈ ఇద్దరి మధ్యా నలుగుతోందని సౌత్ టు నార్త్ టాక్ నడుస్తోంది.

అసలే సినీ ఇండస్ట్రీ కరోనా సంక్షోభంలో ఉంది కాబట్టి కలెక్షన్లకు ఇబ్బంది తలెత్తకుండా అందరూ చర్చించుకుని క్లాష్ రాకుండా రిలీజ్ లు అనౌన్స్ చేస్తేుంటే .. రాజమౌళి మాత్రం ఇలా చెయ్యడం ముమ్మాటికి తప్పంటున్నారు బోనీకపూర్ . 6 నెలలకు ముందే తన ప్రొడక్షన్ లో అజయ్ దేవ్ గన్ నటిస్తోన్న మైదాన్ మూవీ రిలీజ్ డేట్ అక్టోబర్ 15 అని అనౌన్స్ చేశారు బోనీ. ఇది తెలిసీ ఇలా అనైతికంగా సినిమా రిలీజ్ అనౌన్స్ చెయ్యడం కరెక్ట్ కాదన్నారు బోనీ. రాజమౌళి ఇలా చెయ్యడం ఇప్పుడే కాదు .. 5 ఏళ్ల క్రితం శివగామి క్యారెక్టర్ కోసం శ్రీదేవిని అడిగినప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేశారని… ఏం సమాధానం చెప్పలేదని అంటున్నారు బోనీకపూర్.

రాజమౌళి శివగామి క్యారెక్టర్ కోసం శ్రీదేవిని అడిగినప్పుడు ..చాలాతక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని , అసలు అప్పట్లో శ్రీదేవి ఫుల్ ఫామ్ లో ఉందని , అలాంటప్పుడు అంత తక్కువ రెమ్యూనరేషన్ కి ఎలా ఒకే చెబుతారంటున్నారు బోనీ. శ్రీదేవి ఒప్పుకోలేదని ..శ్రీదేవి గురించి మీడియాలో చాలా తప్పుగా మాట్లాడారని , రాజమౌళి అందుకే అన్ ప్రొఫెషనల్ అని పబ్లిక్ గానే చెబుతున్నారు బోనీకపూర్ . మైదాన్ రిలీజ్ డేట్ విషయం గురించి బోనీ తో డిస్కస్ చెయ్యమని రాజమౌళికి అజయ్ దేవ్ గన్ చెప్పినా .. రాజమౌళి మాత్రం బోనీకపూర్ తో మాటమాత్రం కూడా చెప్పకుండా అక్టోబర్ 13 రిలీజ్ అనౌన్స్ చేసేశారని ఇలాంటి బిహేవియర్ తో రాజమౌళి ఎంత అన్ ప్రొఫెషనలో అర్దమవుతోందటున్నారు బోనీ.