నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో మూవీకి టైటిల్ అఖండగా ఫిక్స్ చేసారు. ఉగాది ప్రత్యేకంగా మా సినిమా టైటిల్ అఖండ అంటూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాత మిరియాల రవీందర్.
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ కాగా శ్రీకాంత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 28 న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది అఖండ..

టైం తీసుకొండి…పర్లేదు..కానీ ట్రెండీ టైటిల్ తోనే రావాలంటున్నారు స్టార్ హీరోలు. ఇప్పుడు మేకర్స్ కి టైటిల్ వెతకడమంటే కత్తి మీద సాములా మారింది. అందుకే ముందే సినిమా పేరు ప్రకటించకుండా వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ కానిచ్చి…ఇదీ అదిరే టైటిల్ అనుకున్నప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడలానే ఉగాది కోసం ఎదురుచూస్తుంది బిబి3 మూవీ టీమ్. ఎందుకంటే మూవీ రిలీజ్ కి ఇంకా ఎక్కువ టైం లేదు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న బిబి3 ప్రాజెక్ట్…మే 28వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలకృష్ణ-బోయపాటి సినిమాకు సంబంధించి ఎన్నో పేర్లు వినిపించినా…చివరికి గాడ్ ఫాదర్ అన్న టైటిల్ ఫిక్సయినట్టు చెప్తున్నారు. బోయపాటి మోనార్క్ అనుకున్నా…గాడ్ ఫాదర్ పేరే ఖరారైనట్టు టాక్. కాదు బాలకృష్ణ అఘోరాగా కనిపించనున్న ఈ సినిమాకి ఏదో సంస్కృతపదాన్ని టైటిల్ గా పెడుతున్నారనే ప్రచారమూ జరుగుతుంది. అయితే బాలయ్య సినిమా అసలైన పేరేంటో తెలియాలంటే మాత్రం ఉగాది వరకు ఆగల్సిందే.

పల్లెటూరి వీరయ్యగా చిరంజీవి సందడి చేయనున్నారని సమాచారం. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్‌ప్రారంభించారు బాబీ. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రాజెక్ట్ కి ‘వీరయ్య’ అనే టైటిల్‌అనుకుంటున్నారు. అలాగే ఆచార్య తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో చిరూ నటించబోయే సినిమాకు రారాజు అన్న టైటిల్ పరిశీలనలో ఉంది.

ఎన్నో పేర్లు ట్రెండ్ అయ్యాక…పవన్, క్రిష్ కాంబోమూవీకి హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక రవితేజ, నక్కిన త్రినాథరావు కాంబో మూవీకి ఘరానా మొగుడు అనే టైటిల్ ఖరారైందని అంటున్నారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో నితిన్ అంధుడిగా నటిస్తోన్న సినిమాకు మ్యాస్ట్రో అన్న పేరు ఫిక్స్ చేసారు. వరుణ్ తేజ్ గని, విజయ్ దేవరకొండ లైగర్…ఇలా ప్రతి సినిమా పేరులోనూ కొత్తదనం ఉండేలా చూస్తున్నారు టాలీవుడ్ స్టార్స్.

నందమూరి బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ బిబి3 పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. పవర్‌ ప్యాక్డ్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో యాక్టర్ శ్రీకాంత్‌ నటించబోతున్నారు. ఈ సినిమాలో ఆయన ఓ ప్రధానపాత్ర చేస్తున్నారు. శ్రీకాంత్‌ పుట్టినరోజు ప్రత్యేకంగా విషెస్‌ తెలియజేస్తూ తాజాగా మూవీయూనిట్ ఓ పోస్టర్‌ షేర్ చేసింది. అయితే ఇందులో శ్రీకాంత్ చేస్తున్నది ప్రతినాయకుడి పాత్రా…మరేదైనా అన్నది తెలియాల్సిఉంది. ఇంతకుముందు బోయపాటి దర్శకత్వంలో ‘సరైనోడు’ సినిమాలో నటించారు శ్రీకాంత్. ఇప్పుడు మరోసారి ఆయన డైరెక్షన్లో బాలయ్యతో చేయబోతున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యాజైశ్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా పూర్ణ మరో పాత్రలో కనిపించనుంది. సమ్మర్ కానుకగా మే 28వ తేదీన థియేటర్స్ కి రానుందీ సినిమా.

ఇస్మార్ట్ శంకర్ తో స్మార్ట్ మాస్ హీరోగా సెటిలయిన హీరో రామ్ మరో మాస్ సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి కాంబోలో రామ్ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కృతిశెట్టిని ఫైనల్ చేసారు. అతిత్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుగబోతుంది. కాగా తాజాగా బాలయ్య హిట్ కాంబో డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో రామ్ మూవీ చేయనున్నాడనే వార్త జోరందుకుంది. బాలకృష్ణతో ప్రస్తుతం బోయపాటి చేస్తోన్న మూవీ కాగానే…రామ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అంటున్నారు.

వర్కింగ్ టైటిల్ బీబీ3తో శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు… నంద‌మూరి బాల‌కృష్ణ-బోయ‌పాటి శ్రీను. వీరిద్దరి కాంబినేష‌న్ మూవీకి ఇంతవరకు అధికారికంగా ఎలాంటి టైటిల్ ప్రకటించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ స్పెషల్ కాంబో మూవీకి మోనార్క్ అనే పేరును దాదాపు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక ఇప్ప‌టికే రిలీజైన ఈ ప్రాజెక్ట్ ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్లకు సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. మే 28న రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు మేకర్స్. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం టైటిల్ ఏంటో మాకు చెప్పాలని బాగా డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో…ఇదిలా జరుగుతుండగానే, బోయపాటి శ్రీను మోనార్క్ అనే టైటిల్‌ను ఆల్రెడీ రిజిస్ట‌ర్ చేసిన‌ట్టు వార్తలొస్తున్నాయి.

అయితే మోనార్క్ అని బోయపాటి అనుకుంటున్నప్పటికీ బాలకృష్ణ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిఉంది. ఎన్ని ప‌వ‌ర్ఫుల్ పేర్లు తెర‌పైకొచ్చినా..మోనార్క్ అనేది మాత్రం బాల‌య్య బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ అని మూవీ యూనిట్ అనుకుంటోందట. ప్ర‌స్తుతానికైతే డైరెక్టర్ బోయ‌పాటి ముందున్న‌ ఒకే ఒక్క ఆప్షన్ కూడా ఇదేనని చెప్పుకుంటున్నారు. మ‌రి మోనార్క్ గానే బాలకృష్ణను చూపిస్తారా….సరికొత్త టైటిల్ ను తెరపైకి తీసుకొస్తారా…ముందు ముందు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి…నెక్ట్స్ లూసిఫర్ రీమేక్ పనులను షురూ చేయనున్నారు. మోహన్ రాజా డైరెక్ట్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో నటించనున్నారు. అయితే ఈ రెండు కాకుండా డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు చిరంజీవి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. అయితే ఈ చిత్రంలో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి చిరూకి ధీటుగా విలన్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఉప్పెనలో విజయ్ నటనకు ముగ్ధుడైన చిరూ…అడిగిమరీ విజయ్ సేతుపతిని ప్రతినాయకుడిగా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం.

చిరూ విలన్ సంగతలా అంటే ఎప్పటినుంచో సరైన ప్రతినాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు బోయపాటి – బాలకృష్ణ. అయితే వీరిద్దరి మూడో కాంబోమూవీలో విలన్ గా సునీల్ శెట్టి దాదాపు ఫిక్స్ అయనట్టేనని టాక్. త్వరలోనే ఆయన బాలయ్యతో పాటూ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. జగపతిబాబు, శ్రీకాంత్, అర్జున్…ఇలా చాలామందిని అనుకొని చివరికి సునీల్ శెట్టి దగ్గర ఆగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అఘోరా వేషంలో షూటింగ్ చేస్తున్న బాలయ్యబాబు…త్వరలోనే సునీల్ శెట్టిని ఢీకొట్టే సీన్స్ లో నటించనున్నారు.

మే 28న విడుదల తేదీని ప్రకటించి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు బోయపాటి – బాలయ్య. ఈ సినిమాలో రెండు పాత్రల్లో బాలకృష్ణ కనిపిస్తారనే ప్రచారం జరిగింది. అందులో ఒకటి కాశీలో నివసించే అఘోరా పాత్ర అన్నది బాగా వినిపించింది. అయితే ఈ కాంబో సినిమాలో ఆ అఘోర పాత్రను తీసేస్తున్నారని టాక్. బాలకృష్ణను కాసేపు అఘోరాగా చూపిద్దామనుకున్న బోయపాటి ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది. మరి అఘోర పాత్రను ఇంకోలా డిజైన్ చేసారా…మొత్తానికే తొలగించారా అన్నది తెలియాల్సిఉంది. కాగా ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

BB3 సినిమా తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తారనే వార్త బలంగా వినిపిస్తోంది. క్రాక్ హిట్ తో మంచి జోష్ మీదున్న గోపీచంద్ మలినేని…ఈమధ్యే బాలయ్యను కలిసి కథ వినిపించారట. కేవలం బాలకృష్ణను దృష్టిలో పెట్టుకొని రాసిన ఆ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో నటసింహం సైతం వెంటనే అంగీకరించందని టాక్. ఇక ఈ సినిమాను నిర్మించబోతున్న మైత్రీ మూవీ మేకర్స్ త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనుందట.

కరోనాతో ఢీలాపడ్డ సినీపరిశ్రమ ప్రస్తుతం తెగ సందడి చేస్తోంది. గతేడాది వాయిదాపడ్డ సినిమాలతో పాటూ ఈ ఏడాది రీలీజ్ కి రెడీ అవుతోన్న సినిమాలు కలుపుకొని టాలీవుడ్ జోరు చూపిస్తోంది. వరుసపెట్టి విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సంవత్సరం బడా హీరోల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఒకే నెలలో నువ్వా నేనా అనుకునేలా పోటీపడుతున్నారు టాలీవుడ్ హీరోలు.
ఏప్రిల్ నెల గురించి తెలిసిందే ఏప్రిల్ 16న నాగచైతన్య, నానిల మధ్య క్లాష్ ఏర్పడుతోంది. ఒక నెల మాత్రమే కాదు ఒకే రోజు వీళ్లిద్దరి లవ్ స్టోరీ, టక్ జగదీష్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఇక మే నెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఒక్క నెలలో చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రవితేజ సినిమాలు వరుసబెట్టి రిలీజ్ కాబోతున్నాయి. మే 13న చిరూ ‘ఆచార్య’, మే 14న వెంకీ ‘నారప్ప’ వస్తుండగా మే 28న ‘బాలయ్య, బోయపాటి’ కాంబో మూవీతో పాటూ రవితేజ ‘ఖిలాడి’ కూడా బరిలోకి దిగుతోంది. ఆలా బడా హీరోలు ఒకే టైంలో రంగంలో దిగుతున్న ఘట్టం కేవలం 90ల్లో కనిపించేది. మళ్లీ ఇనాళ్లకి ఈ ఫీట్ రిపీట్ కానుంది.
చిరూ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’ రిలీజ్ టైంలోనూ గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రంతో పోటీకొచ్చారు బాలకృష్ణ. కాకపోతే ఈసారి వీళ్లిద్దరి చిత్రాలకు రెండు వారాల తేడా వచ్చి ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ నిచ్చింది. కాకపోతే ఆచార్య వచ్చిన ఒక్కరోజు తేడాతోనే నారప్ప విడుదలవుతోంది. అలానే రవితేజ ఖిలాడీ, బాలకృష్ణ సినిమా ఒకేరోజు ఢీకొట్టబోతున్నాయి. దీంతో కలెక్షన్లు తేడా కొట్టే అవకాశమూ లేకపోలేదు. అందుకే ఏప్రిల్ లో నాగచైతన్యను ముందుంచి నాని, చిరూతో పోటీకి వెంకీ, బాలయ్యతో ఎదురులేకుండా రవితేజ తగ్గొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. మరి నిజంగానే తగ్గుతారా…లేదూ సై అంటే సై అంటారా….అలా అనుకుంటే సినీపోరులో గెలుపెవరిది అన్నది ఆసక్తిగా మారింది.