సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ బుచ్చిబాబు సిద్ధం చేసుకున్న కథను నమ్మి అవకాశం ఇచ్చారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. వాళ్ల నమ్మకాన్ని ఉప్పెన బంపర్ హిట్ తో నిలబెట్టాడు బుచ్చిబాబు. అందుకే తనకు వాళ్ల సంస్థలోనే ఓ హీరోతో సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చారు నిర్మాతలు. అంతేకాదు తాజాగా సానా బుచ్చిబాబుకు 60లక్షల రూపాయలకు పైగా ఖరీదైన మెర్సిడిస్ బెంజ్ జి ఎల్ సి కారును గిఫ్ట్ గా అందించారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. ఈ తీసుకున్న వెంటనే తన గురువు సుకుమార్ ను ఎక్కించుకొని హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొట్టారు బుచ్చిబాబు.
నిజానికి లాక్ డౌన్ ముందే దాదాపు ఉప్పెన చిత్రీకరణ పూర్తయింది. కరోనాతో థియేటర్లు మూతపడ్డాక ఓటీటీ నుంటి ఫ్యాన్సీ ఆఫర్లే వచ్చాయి నిర్మాతలకు. కానీ లాక్ డౌన్ ఎత్తేసి..సినిమాహాళ్లు ఓపెన్ అయ్యేదాకా వేచిచూసి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఈ ఊహించని విజయంలో భాగమైనందుకు గానూ హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టిలకు సైతం బహుమతులు అందించారు నిర్మాతలు. ఇప్పుడు డైరెక్టర్ వంతు వచ్చింది. సూపర్ బెంజ్ ఇచ్చేసారు. ఇక తర్వాతి సినిమా పెద్ద హీరోతో. ఆ హీరో ఎవరో..ఆ సినిమా మళ్లీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ఎలాంటి లాభాలను తెచ్చిపెడుతుందో..చూడాలి.

మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్‌ తేజ్ న‌టించిన ఫస్ట్ మూవీ ‘ఉప్పెన’ సూప‌ర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మూవీ యూనిట్ తాజాగా విజయోత్సవ సంబ‌రాలు చేసుకుంది. హైదరాబాద్‌లో జ‌రిగిన ఈ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున పాల్గొన‌డంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు అల్లు అర్జున్‌, సాయి‌ తేజ్‌, సుకుమార్ ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, మరికొందరు సెలబ్రిటీస్ సైతం ఇందులో పాల్గొన్నారు.

Image
ImageImageImage

సైలెంట్‌గా వ‌చ్చి వయొలెంట్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు ఉప్పెనతో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్ద‌రు కొత్త నటులతో, విజయ్ సేతుపతి వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ తో బంపర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడాయన నెక్ట్స్ మూవీ ఎవ‌రితో చేస్తార‌నే దానిపై ప్రతిఒక్కరిలో క్యూరియాసిటి పెరిగింది.
అయితే కమిట్మెంట్ ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే రెండు సినిమాలు చేయనున్నాడు బుచ్చిబాబు. రెండో సినిమా అక్కినేని నాగ చైత‌న్యతో చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. నిన్నటివరకు అఖిల్ కోసం నాగార్జున రాయభారం నడిపారని అనుకున్నారు. కానీ బుచ్చిబాబు చైతూతో కమిటైనట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే నాగార్జునతో పాటూ చైతన్యకూ స్టోరీ వినిపించ‌డం… ఓకే చెప్పడం కూడా జ‌రిగిపోయాయ‌ట‌. ఈ ఏడాదిలోనే ఈ మూవీ ప్రారంభంకానుంది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ మూవీ చేస్తోన్న చైతూ…నెక్ట్స్ బుచ్చిబాబుతోనే పట్టాలెక్కుతాడేమో చూడాలి.

ఫిబ్రవరి 12న ప్రేక్షకుల హృదయాల్లో ప్రేమ ఉప్పొంగేలా చేసేందుకు దూసుకొస్తుంది ఉప్పెన చిత్రం. దేవీశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను తాకాయి. ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారిపోయాయి. రీసెంట్ గా రిలీజైన ఉప్పెన ట్రైలర్ సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచింది. హీరో హీరోయిన్…వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి ప్రేమతో ఆకట్టుకుంటే…విలన్ విజయ్ సేతుపతి ద్వేషంతో భయపెట్టారు. అసలింత కథకు కారణమైన డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు.

డైరెక్టర్ సుకుమార్ శిష్యునిలా చాలా వినయంగా కనిపించే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దగ్గర చాలా విషయం దాగుందని ఇప్పటికే టాలీవుడ్ కి తెలిసిపోయింది. సినిమా రిలీజ్ కాకముందే హిట్ టాక్ సొంతం చేసుకుందంటే ఏ రేంజ్ లో ఉప్పెన ఇంపాక్ట్…ఆడియెన్స్ పై పడిందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు అందరూ బుచ్చిబాబుని మెచ్చుకుంటున్నారు. ఇక తన శిష్యుడి గురించి ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు లెక్కల మాస్టార్ కం క్రేజీ డైరెక్టర్ సుకుమార్.

వైష్ణవ్ తేజ్…మెగా ఫ్యామిలీ నుంచి బయల్దేరినా కాస్తంత గర్వం చూపించట్లేదు. రీసెంట్ గా జరిగిన ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో వైష్ణవ్ మాట తీరుని బట్టి హీరోగా నిలదొక్కుకునేందుకు ఎక్కువరోజులు పట్టదని అనిపించకమానదు. ముఖ్యంగా నేల విడిచి సాము చేసే లక్షణం కాదు వైష్ణవ్ తేజ్ ది. అందుకే మాస్ మసాలా సబ్జెక్ట్ తో హీరోగా…తనని తాను చాటుకునే ప్రయత్నం చేయకుండా డైరెక్టర్ ఫిల్మ్..కథే హీరో అన్న చిత్రాన్ని ఎంచుకున్నాడు.

Source: Mythri Movie Makers

కృతి శెట్టి…ఇప్పుడు కుర్రకారుని నీ కన్ను నీలిసముద్రం అంటూ తన వైపుకు తిప్పుకునేలా చేసిన కన్నడ పరిమళం. అచ్చు తెలుగమ్మాయిలాగానే కనిపిస్తూ…చివరికి ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో సైతం తెలుగులోనే మాట్లాడి ఆహా అనిపించుకుంది కృతి. అందం అంతకుమించిన అభినయం ప్రదర్శిస్తుందనే టాక్ రావడంతో ఇప్పుడు టీటౌన్ డైరెక్టర్స్ వరుసగా కృతి కాల్షీట్స్ కోసం క్యూ కడుతున్నారు.

హీరోగానే చేయాలనే రూల్ పెట్టుకోకుండా వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న నటుడు విజయ్ సేతుపతి. అసలు హీరోగా చేస్తున్న సమయంలో ఇలా హీరోయిన్ తండ్రిగా చేసే అవకాశాన్ని ఎవరూ అంత ఈజీగా ఒప్పుకోరేమో. కానీ సేతుపతి చేసి చూపించారు. సో ఇలా విడుదలకు ముందే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఉప్పెన టీమ్…విడుదల తర్వాత బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతోంది ఆహాచిత్రం.