ఓ కలయిక ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. క్రేజీ ప్యాన్ ఇండియా చిత్రాల దర్శకుడు టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ని కలవడంతో మురిసిపోతున్నారు ఫ్యాన్స్. స్టైలిష్ స్టార్ గా బన్నీకున్న టాలీవుడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అయితే కేరళ, తమిళనాడులో సైతం అల్లు అర్జున్ అంటే ఓ క్రేజ్ ఉంది. ఇక దేశవ్యాప్త గుర్తింపు కోసం పుష్పతో ప్యాన్‌ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బన్నీ… కేజీఎఫ్‌ ఫేం డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ను కలిసినట్టు…ఆయన చెప్పిన కథ విన్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు ప్రశాంత్‌ నీల్, గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో బన్నీని కలిసి బయటకొస్తున్న ఫొటోలు, వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో బన్నీకి ప్రశాంత్‌ కథ చెప్పడానికే వచ్చాడని, అతిత్వరలోనే వీరిద్దరి కలయికలో ఓ సూపర్ మూవీ పట్టాలెక్కబోతుందంటూ ప్రచారం జోరందుకుంది.

స్టైలిష్ స్టార్, రౌడీబాయ్ కలవనున్నారా? కలిసి ఒకే సినిమాలో నటించనున్నారా? అనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మల్టీస్టారర్ జోరు ఊపందుకుంది. ఓవైపు చరణ్, ఎన్టీఆర్…మరోవైపు పవన్ కల్యాణ్, రానా…చిన్నహీరోల సంగతి సరేసరి. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండతో కలిసి అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నారనే వార్త వైరల్ గా మారింది.
‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ సినిమాల ద్వారా మంచిపేరుతెచ్చుకున్న మహి.వి.రాఘవ్ ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఈ డైరెక్టర్ ఇద్దరు హీరోలకు కథ వినిపించడం, ఓకే చెప్పడం జరిగిపోయాయని…స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రొడక్షన్ లోనే ఈ మూవీ పట్టాలెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతిత్వరలో వెల్లడిస్తారట.
బన్నీ, విజయ్ దేవరకొండల మధ్య స్నేహం ఉంది. బయట కలుసుకోవడమే కాదు…సోషల్ మీడియాలా సైతం ఇద్దరు ఒకరి గురించి ఒకరు ప్రస్తావిస్తుంటారు. విజయ్ ‘బన్నీ అన్న’ అంటే, బన్నీ ‘బ్రదర్’ అంటారు. అలాగే విజయ్ రౌడీ బ్రాండ్ బట్టలను సైతం బన్నీ వేసుకొని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఆల్రెడీ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో విజయ్ చేసిన గీతగోవిందం సినిమా టైంలో విజయ్ ను తెగ పొగిడి బన్నీ, బన్నీ జపం చేసి విజయ్ దేవరకొండ వార్తల్లో నిలిచారు. ఇప్పుడిలా ఒకే సినిమాలో కనిపించినా ఆశ్చర్యం లేదు. అయితే ఫ్యాన్స్ కు మాత్రం ఇది పండగే. మరి చూద్దాం…ఏం జరగబోతుందో…