కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ తరీఖే వేరు. ఏం చేసినా సమ్ థింగ్ డిఫరెంట్ గానే చేస్తారు . సినిమాల విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే లేనటువంటి 4 ప్రెస్టీజియస్ ప్రదేశాల్లో షూట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. స్వదేశ్ సినిమాలో నాసా సైంటిస్ట్ క్యారెక్టర్ లో కనిపించారు షారూఖ్. స్పేస్ రీసెర్చ్ కంపెనీ నాసా లో స్వదేశ్ షూటింగ్ చేసి అక్కడి ఎట్మాస్పియర్ ఎలా ఉంటుందో చూపించారు ఈ స్టార్ హీరో .

నాసా సరిపోదనట్టు …ఇంకో సినిమాలో ఏకంగా డిస్కవరీ ఛానల్ హెడ్ క్వార్టర్స్ లోనే చిత్రీకరణ చేశారు షారూఖ్ ఖాన్ . జబ్ తక్ హై జాన్ మూవీలో డిస్కవరీ ఛానల్ రిపోర్టర్ గా కనిపించిన అనుష్క శర్మ .. షారూఖ్ లైఫ్ స్టోరీ ని ఛానల్ లో ప్రజెంట్ చేస్తుంది. ఈ సీన్ ని ఏకంగా డిస్కవరీ ఛానల్ హెడ్ క్వార్టర్స్ లో షూట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు .

ఈ రెండు టాప్ లొకేషన్స్ ని మర్చిపోక ముందే .. ఏకంగా మేడమ్ టుస్సాడ్స్ మెయిన్ బ్రాంచ్ లో తన సినిమా షూటింగ్ చేశారు షారూఖ్ . ఫ్యాన్ సినిమాలో తన స్టాచ్యూ ని తనే చూసుకుంటూ చేసే సీన్ కోసం ఏకంగా లండన్ లోని టుస్సాడ్స్ మ్యూజియం లొకేషన్ కి వెళ్లింది టీమ్ . ఈ టాప్ లొకేషన్స్ లేనే కాకుండా ఇప్పుడు సిద్దార్ద్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పఠాన్ సినిమాకు సంబందించి కూడా ఫైట్ సీన్ కోసం ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా మీదకు వెళుతున్నారు షారూఖ్ అండ్ టీమ్. బాలీవుడ్ బాద్ షా అంటే అంతే ..ఏంచేసినా డిఫరెంటే అంటున్నారు ఫ్యాన్స్ .

శాండిల్ వుడ్ స్టార్‌ యాక్టర్ సుదీప్‌ కి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశంలో ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ మాత్రమే సంపాందిచిన అటువంటి గుర్తింపు….ఇప్పుడు సుదీప్ సొంతమైంది. భారతీయ వెండితెరపై విలక్షణ నటుడన్న పేరుంది ఈ హీరోకి. రీసెంట్ గా ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా బిల్డింగ్ పై సుదీప్ లేజర్ షో వేసారు. ఆయన హీరోగా నటిస్తోన్న ‘విక్రాంత్‌ రోనా’ మూవీ టైటిల్‌ లోగోను, టీజర్‌ను ఈ లేజర్‌ షోతో బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ప్రపంచం మొత్తానికి ఓ కొత్త హీరో దొరికాడంటూ ప్రశంసలు కురిపించారు.

ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులు, ప్రభావిత వ్యక్తులతో పాటూ అతిముఖ్య సంఘటనలు మాత్రమే దుబాయ్ బూర్జ్ ఖలీఫా లేజర షో ద్వారా కనిపించే అదృష్టాన్ని దక్కించుకున్నాయి. ఇక ఇండియాపరంగా చూసుకుంటే షారుఖ్‌ ఖాన్ తర్వాత సుదీప్‌కే ఇంతటి ఘనత సొంతమైంది. దీంతో సుదీప్‌ ఫ్యాన్స్ ఫుల్‌ జోష్ మీదున్నారు. తాము అభిమానించే ఓ నటుడికి ఇలాంటి గౌరవం దక్కడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.