సంక్రాంతి సీజన్ తర్వాత ప్రేమికుల దినోత్సవాన్ని టార్గెట్ చేసాయి కొత్త చిత్రాలు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా రెండురోజుల ముందుగానే ‘ఫిబ్రవరి 12’ నుంచే సందడి చేసేందుకు క్యూ కట్టాయి కొన్ని సినిమాలు ఒకేరోజు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసాయి.
‘ఉప్పెన’ ఎన్నో నెలలుగా రిలీజ్ కోసం కాచుకూర్చున్న సినిమా ఇది. మెగా ఫ్యామిలి హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా కావడం…పాటలు సూపర్ డూపర్ హిట్టవడంతో మంచి అంచనాలే ఉన్నాయి ఈ సినిమా మీద. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కరోనా కారణంగా గతేడాది వాయిదాపడింది. ఓటీటీ ఆఫర్ వచ్చినా వద్దనుకున్నారు. థియేటర్లోనే రిలీజ్ చేసేందుకు వెయిట్ చేసి ఫిబ్రవరి 12న వచ్చేందుకు రెడీఅయ్యారు.
‘ఉప్పెన’తో పాటే ఫ్యామిలీ హీరో కమ్ విలన్ జగపతిబాబు నటించిన ‘FCUK’ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ జనాల్ని బాగానే అట్రాక్ట్ చేస్తోంది. ఇక వీటితో పాటూ యాక్షన్ హీరో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన టెక్నికల్ థ్రిల్లర్ ‘చక్ర’, ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘శశి’ సినిమాలు సైతం ఫిబ్రవరి 12నే వచ్చేందుకు ముహూర్తం పెట్టుకున్నాయి.