పవన్‌ కల్యాణ్ హీరోగా క్రిష్‌ డైరెక్షన్లో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల కిందటి పీరియాడికల్‌ డ్రామా కథాంశంతో భారీ అంచనాల మధ్య ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వర్కింగ్‌ టైటిల్‌ ‘PSPK27’ తో షూటింగ్ జరుపుకొంటున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. చారిత్రాత్మక నేపథ్యంగా రానున్న ఈ మూవీలో 17వ దశాబ్దం కాలాన్ని రీక్రియేట్ చేస్తున్నారు. ఈ స్టోరీలో భాగంగానే చార్మినార్‌ వైభవాన్ని చూపించనున్నారట. సినిమాలో ఎక్కువ భాగం చార్మినార్‌ బ్యాక్ డ్రాప్ గా షూటింగ్ జరపాల్సి రావడంతో ఏకంగా చార్మినార్ సెట్ నిర్మిస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ మూవీ టైటిల్‌ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ‘హర హర మహాదేవ్’ దాదాపు ఫిక్సయినట్టే అన్న ప్రచారం జరుగుతోంది. ‘విరూపాక్ష’, ‘హరిహర వీరమల్లు’.. వంటి పేర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. మంచి సమయం చూసుకుని మరికొన్ని రోజుల్లోనే క్రిష్, పవన్ కాంబో మూవీ టైటిల్ ప్రకటిస్తామని చెబుతున్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు హీరోయిన్ నిధి అగర్వాల్‌ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి తెలియాల్సి ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.