చిరూ నటిస్తోన్న ఆచార్య షూటింగ్ క్లైమాక్స్ కొచ్చేసింది. షూటింగ్ పూర్తైన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరపనున్నారు. ఎందుకంటే మే 13న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఆచార్య తర్వాత…చిరూ మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయనున్నారు. అయితే ఈ రెండు చిత్రాలతో బిజీగా ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి.

తాజాగా ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చిరూ…తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ సీక్రెట్ బయటపెట్టేసారు. బాబీగా పిలుచుకునే డైరెక్టర్ కేఎస్.రవీంద్రతో కలిసి సినిమా చేయబోతున్నానని ప్రకటించారు చిరంజీవి. లూసిఫర్ తర్వాత బాబీ దర్శకత్వంలో తాను చేయబోయే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని కూడా తెలియజేసారు. ఇలానే ఓ పిట్ట కథ వేడుకలో ఆచార్య టైటిల్ ను రివీల్ చేసారు చిరూ. అందుకే ఆయన్ని బోళా మనిషిగా అభివర్ణిస్తుంది సినీఇండస్ట్రీ.