హాలీవుడ్ తర్వాత బాలీవుడ్ కి మాత్రమే పరిమితం అనుకున్న సీక్వెల్స్ జోరు ఇప్పుడు టాలీవుడ్ లోనూ కనిపిస్తోంది. బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాల పార్ట్ 2 తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బడా హీరోల నుంచి యంగ్ స్టర్స్ వరకు… ప్రెజంట్ స్వీక్వెల్ జపం చేస్తుంది తెలుగు ఇండస్ట్రీ.

కొన్ని కథలు ఎప్పటికీ వావ్ అనిపిస్తాయి. ఇంకా ఉంటే బావుండు అనిపించేలా మెస్మెరైజ్ చేస్తాయి. అలాంటి కథలకు బాక్సాఫీస్‌విజయం దక్కితే ? కాంబినేషన్‌రిపీటవుతే బాగుండు అని ప్రేక్షకులు ఫీలవుతే? వీటికి తోడూ ఆ కథను కొనసాగించే స్కోప్‌ఉంటే…ఇంకేముంది సీక్వెల్ని మొదలెట్టే ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడలాగే టాలీవుడ్లో పార్ట్ 2 జోరు ఊపందుకుంది.

మలయాళీ రీమేక్ గా వచ్చి తెలుగులోనూ కాసులవర్షం కురిపించింది..దృశ్యం. వెంకటేశ్ లీడ్ రోల్ చేసిన ఈ మూవీ సీక్వెల్ ఈ మార్చి నుంచే షురూకానుంది. రీసెంట్ గా ఓటీటీ వేదికగా దృశ్యం సీక్వెల్ మలయాళంలో రిలీజై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. సో వెంకీ సైతం దృశ్యం పార్ట్ 1 తర్వాత ఏం జరిగిందో చూపించేందుకు రెడీఅయ్యారు. అంతేకాదు వరుణ్ తేజతో కలిసి ఎఫ్ 2 సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. ఎఫ్ 2కి మించిన కామెడీతో, కథతో ఎఫ్ 3ని సిద్ధం చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అంటే ఈ ఏడాది రెండు సీక్వెల్స్ తో థియేటర్స్ కి రానున్నారు వెంకటేశ్.

బంగార్రాజు ఈజ్‌బ్యాక్‌ అంటున్నారు నాగార్జున. 2016లో సొగ్గాడే చిన్ని నాయనా అంటూ హిట్ కొట్టిన నాగ్…ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్ రూపొందించే పనిలోఉన్నారు. బంగార్రాజు చుట్టూ అల్లుకున్న కథతో ఈ స్క్రిప్ట్ ను రెడీచేసాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. మార్చి నుంచి ఈ మూవీ సెట్స్‌ పైకెళ్లనుందని సమాచారం. అటు డబుల్ డోస్ ఇచ్చేందుకు ప్లాన్ చేసారు మంచు విష్ణు, శ్రీను వైట్ల. ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్‌ ‘ఢీ 2 : డబుల్‌డోస్‌’ టైటిల్‌తో ఈ సీక్వెల్‌తెరకెక్కనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.

‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ తేజ..ఇప్పుడా మూవీకి సీక్వెల్ గా చిత్రం1.1ను ప్రకటించారు. మొదటి భాగంతో ఉదయ్‌కిరణ్, రీమా సేన్‌వంటి యాక్టర్స్ ను పరిచయం చేసిన తేజ… ఈ సీక్వెల్ కోసం సుమారు 45 మంది కొత్తవాళ్లను తీసుకోనున్నారు. ఇక రామ్, పూరి జగన్నాథ్‌కాంబో మూవీ ‘ఇస్మార్ట్‌శంకర్‌’ చిత్రీకరణలో ఉండగానే సీక్వెల్‌ఉంటుందని అనౌన్స్ చేసారు పూరీ. ఈ సీక్వెల్‌కి ‘డబుల్‌ఇస్మార్ట్‌’ అనే టైటిల్‌కూడా రిజిస్టర్‌చేసారు. ఇవే కాదు అడవి శేష్ గూఢచారి రిటర్న్స్‌, నిఖిల్ కార్తీకేయ -2, విశ్వక్ సేన్ హిట్ -ది సెకండ్ కేస్, డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ అ!, జాంబీ రెడ్డి సినిమాలు కూడా సీక్వెల్స్ కథలతో సిద్ధంగా ఉన్నాయి.

2000వ సంవత్సరంలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ వంటి యంగ్ సెన్సేషన్స్ ను పరిచయం చేస్తూ డైరెక్టర్ తేజా సృష్టించిన చిత్రం…’చిత్రం’. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసినట్టు తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు తేజా. 45 మంది కొత్త నటీనటులతో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. చిత్రం సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్… చిత్రం1.1తో మళ్లీ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంగా సాగే ఈ మూవీ వచ్చే నెల నుంచే సెట్స్ పైకెళ్లనుంది

2000వ సంవత్సరంలో చిత్రం ఒక సెన్సేషన్. ఎందుకంటే అలాంటి బోల్డ్ కంటెంట్ తో తెలుగులో వచ్చిన సినిమాలు అప్పటివరకు చాలా తక్కువ. వెండితెరకు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు తేజా చేసిన చిత్రం..మంచి విజయాన్నే అందుకుంది. ఉషా కిరణ్ మూవీస్ ఈ సినిమాను నిర్మించింది. మళ్లీ 21ఏళ్ల తర్వాత ఇప్పటి ట్రెండ్ ను ఫాలో అవుతూ చిత్రం 1.1 రానుంది. మరి ఈ జనరేశన్ పిల్లాడిలా ఇందులో హీరోనూ ఉదయ్ కిరణ్, రీమాసేన్ కొడుకుగా పరిచయం చేస్తారేమో చూడాలి.