డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి… హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ యంగ్ హీరో నటించిన చిత్రాలకు సక్సెస్ ద‌క్‌టలేదు. దీంతో జార్జ్ రెడ్డి ఫేం జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించాడు. చోర్ బ‌జార్ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మామూలుగా ఎక్కడెక్కడో దొంగిలించిన వ‌స్తువులన్నీ హైదరాబాద్ చోర్ బ‌జార్‌కు చేరుతుంటాయి. మరి ఇదే నేప‌థ్యంలో డైరెక్టర్ మూవీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా లాంఛ‌న ప్రారంభం తాజాగా జరిగింది. వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వీఎస్ రాజు తన తొలి సినిమాగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న “చోర్ బజార్” సినిమాలో సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళీ, “లేడీస్ టైలర్” ఫేం అర్చన మరికొన్ని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 26 నుండి మూవీ తొలి షెడ్యూల్ మొద‌లు కానుంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు.